• Telugu News
  • /Telangana

Takkallapalli Srinivasa Rao : పంచాయితీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీదారులను ఓడించండి

పంచాయతీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీదారులను ఓడించాలని ప్రజా గొంతుకైన కమ్యూనిస్టులను ఎన్నుకోవాలని సీపీఐ నేత తక్కళ్లపల్లి శ్రీనివాసరావు పిలుపు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Nov 28, 2025, 4:06 pm IST
Read Time: 3 mins
Takkallapalli Srinivasa Rao : పంచాయితీ ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీదారులను ఓడించండి

విధాత, వరంగల్ : గ్రామ పంచాయతీకి జరుగుతున్న ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ చేసి గెలవాలనుకునే వారిని ఓడించాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం సీపీఐ వరంగల్ జిల్లా కార్యాలయంలో జిల్లా సీపీఐ సమితి సమావేశం అక్కపల్లి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన తక్కళ్లపల్లి మాట్లాడుతూ డబ్బు, మద్యం పంపిణీ చేసి ఎన్నికలలో గెలవాలనుకునే వారిని ప్రజలు తిరస్కరించి నిజాయితీ పరులకు పట్టం కట్టాలని కోరారు. అలాగే నిరంతరం ప్రజాసమస్యలపై పోరాడుతూ ప్రజల గొంతుకగా నిలిచిన కమ్యూనిస్టులను పంచాయతీ ఎన్నికలలో ఎన్నుకోవాలని కోరారు. బూర్జువా రాజకీయ పార్టీలు రకరకాల హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయని, అలాంటి పార్టీలకు ఈ ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని అన్నారు. ప్రజాసమస్యలను విస్మరించి పరస్పరం దూషణలు చేసుకుంటున్న రాజకీయ పార్టీలను ప్రజలు తిరస్కరించి నిజాయితీ, నిబద్ధతతో ప్రజల కోసం పని చేసే కమ్యూనిస్టు పార్టీలను ఎన్నికలలో ఆదరించాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఐ వరంగల్ జిల్లా కార్యదర్శి ఎస్ కె బాష్ మియా,రాష్ట్ర సమితి సభ్యులు మేకల రవి, జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి, బుస్సా రవీందర్,తోట చంద్రకళ, వీరగోని శంకరయ్య,సంగి యెలేంధర్,ఐతే యాకయ్య,లాదేల్ల శరత్ తదితరులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి :

TPCC Mahesh Goud | బీఆర్ఎస్ మరో కొత్త డ్రామాకు తెరతీసింది : పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్
Malla Raji Reddy : మావోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి ఎన్ కౌంటర్ !?