అంగ‌న్ వాడీ టీచ‌ర్స్‌, హెల్ప‌ర్‌కు త‌క్ష‌ణ‌మే వేత‌న బ‌కాయిలు విడుద‌ల చేయండి: త‌మ్మినేని వీర‌భ‌ద్రం

అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు మార్చి, ఏప్రిల్‌ నెలల వేతన బకాయిలు తక్షణమే  చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం కోరింది. ఈ మేర‌కు సోవారం సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు

అంగ‌న్ వాడీ టీచ‌ర్స్‌, హెల్ప‌ర్‌కు త‌క్ష‌ణ‌మే వేత‌న బ‌కాయిలు విడుద‌ల చేయండి: త‌మ్మినేని వీర‌భ‌ద్రం

సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాసిన సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం

విధాత‌: అంగన్‌వాడీ టీచర్స్‌, హెల్పర్స్‌కు మార్చి, ఏప్రిల్‌ నెలల వేతన బకాయిలు తక్షణమే  చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డిని సీపీఎం కోరింది. ఈ మేర‌కు సోవారం సీపీఎం రాష్ట్ర కార్య‌ద‌ర్శి త‌మ్మినేని వీర‌భ‌ద్రం సీఎం రేవంత్ రెడ్డి లేఖ రాశారు. అంగ‌న్ వాడీల‌లో ప‌ని చేస్తున్న మ‌హిళ‌లంతా పేద‌వారేన‌న్నారు. రాష్ట్రంలో గత 48 యేళ్ళుగా 65వేల మంది అంగన్‌వాడీ టీచర్స్‌ మరియు హెల్పర్స్‌ ఐసీడీఎస్‌ ద్వారా సేవలందిస్తున్నారని తెలిపారు. వీరికి గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తన హామి మేరకు ప్రతి నెలా 14వ తేదీన వేతనాలు చెల్లించింది.

కానీ మీ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక వీరికి 2024 మార్చి, ఏప్రిల్‌ నెలల వేతనాలను నేటికీ చెల్లించలేదన్నారు. వేత‌నాలు రాక‌65 వేల కుటుంబాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని లేఖ‌లో సీఎం కు వివ‌రించారు. కుటుంబ అవసరాల కోసం అధిక వడ్డీలకు అప్పులు చేసే స్థితికి  నెట్టబడుతున్నారని తెలిపిన వీర‌భ‌ద్రం బకాయి ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించాలని సీఎం రేవంత్‌ను లేఖ‌లో కోరారు. అలాగే  ప్రతినెలా 14వ తేదీన వేతనాలు చెల్లించే విధంగా, తగిన‌ నిర్ణయం  తీసుకోవాలని త‌మ్మినేని వీర‌భ‌ద్రం సీఎంకు విజ్ఞ‌ప్తి చేశారు.