Deputy CM Bhatti | గురుకులాల ప్రక్షాళన.. బడ్జెట్ లో రూ. 5 వేల కోట్లు కేటాయించాం: డిప్యూటీ సీఎం భట్టి
రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు

పక్కాభవనాలు నిర్మిస్తాం
ప్రాంగణాళను అత్యంత పరిశ్రుభంగా ఉంచుతాం
విద్యార్థుల మృతి యావత్ ప్రభుత్వాన్ని కదిలించింది
విదేశాల్లో ఉన్న సీఎం ఫోన్ లో నాతో మాట్లాడారు
ఇలాంటి సంఘటనలు పునరావృతం కానివ్వం
మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం
డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
విధాత: రాష్ట్రంలో ఉన్న అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు. గురుకుల పాఠశాల ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దుతామని భట్టి హామీ ఇచ్చారు. ఇది తానొక్కడిగా చేసుతున్న మాట కాదని తల్లి దండ్రుల బాధ, ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వ మాటగా చెపుతున్నానని అన్నారు. జగిత్యాల జిల్లా మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థుల మృతి నలుగురు విద్యార్థుల అస్వస్థతకు గురైన సంఘటనపై తీవ్రంగా స్పంధించిన డిప్యూటీ సీఎం భట్టి మంగళవారం గురుకుల పాఠశాలను సందర్శించిన అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులను పరామర్శించారు. విద్యార్థులు మృతి చెందడానికి, అస్వస్థతకు సంబంధించిన కారణాలను అడిగి తెలుసుకున్న అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్దపూర్ గురుకుల పాఠశాలలో విద్యార్థుల మృతి యావత్తు ప్రభుత్వాన్ని కల్చివేసింసిందన్నారు. మంత్రి మండలి సభ్యులందరం తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యామన్నారు. మృతి చెందిన విద్యార్థుల ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని కోరుకుంటున్నామన్నారు. ఈ ఘటనపై విదేశీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించి, వెంటనే నాతో ఫోన్లో మాట్లాడారన్నారు. రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా ప్రజా ప్రభుత్వం పై ఉన్నందునే విషయం తెలిసిన వెంటనే నేరుగా పెద్దాపూర్ గురుకుల పాఠశాలకు వచ్చానన్నారు. మృతి చెందిన విద్యార్థుల తల్లిదండ్రులకు గురుకులాల్లో ఉద్యోగం కల్పిస్తామని భట్టి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
రూ. 5 వేల కోట్లు కేటాయించాం
రాష్ట్ర చరిత్రలో ఎన్నడు లేనివిధంగా గురుకుల పాఠశాలల పక్క భవనాల నిర్మాణం కోసం ప్రజా ప్రభుత్వం ఈ బడ్జెట్ లో రూ. 5వేల కోట్లు కేటాయించిందని భట్టి తెలిపారు. బడ్జెట్ పెట్టడానికి ముందే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల పరిస్థితులను తెలుసుకొని విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారించి పెద్ద ఎత్తున నిధులు కేటాయించామన్నారు.
నిర్లక్ష్యం వహించిన గత ప్రభుత్వం
గత పది సంవత్సరాల్లో గురుకుల పాఠశాలల పక్కా భవనాల నిర్మాణం చేయకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితమే అర కొర వసతుల మధ్య గురుకులాలు నడుస్తున్న దుస్థితి నెలకొందన్నారు. 2018- 19 సంవత్సరంలో గురుకుల పాఠశాల పక్కా భవనాల నిర్మాణం కోసం గత ప్రభుత్వం కేవలం రూ. 79 కోట్లు, 2019-20 లో 70 కోట్లు, 2020-21లో రూ. 11 కోట్లు, 2021 22 లో రూ. 9 కోట్లు, 2022-23 లో రూ. 7 కోట్లు, 2023 24 రూ.మూడు కోట్లు మాత్రమే కేటాయించిందన్నారు. నిధుల కేటాయింపు విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఫలితంగానే నేడు ఈ దిస్థితి జరిగిందన్నారు.
ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాలని విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించామని డిప్యూటీ సీఎం అన్నారు. గొప్ప ఆలోచనతో ముందుకెళ్తున్న ఈ తరుణంలో పెద్దాపూర్ లో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం ప్రజా ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిసి వేసిందన్నారు.
12 ఎకరాలు ఉన్న పెద్దాపూర్ పాఠశాలలో భవన నిర్మాణం కోసం 2020-21 వార్షిక సంవత్సరంలో గత ప్రభుత్వం లో నిధులు మంజూరు చేశారు కానీ విడుదల చేయలేదని డిప్యూటీ సీఎం అన్నారు.నిధులు రాకపోవడంతో కాంట్రాక్టర్ అర్ధాంతరంగా పనులను ఆపివేశారన్నారు. ఈ పాఠశాల భవన నిర్మాణానికి కావలసిన నిధులు ఇవ్వడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. పెద్దాపూర్ పాఠశాల చుట్టూ ప్రహరీ గోడ ప్రాంగణాన్ని అభివృద్ధి చేయాలని కలెక్టర్ కు ఆదేశాలు ఇస్తున్నామన్నారు.
ప్రతి నెల హాస్టల్స్ కు డాక్టర్లు
ప్రతి నెల డాక్టర్లు విధిగా హాస్టల్స్ కు వచ్చిన విద్యార్థుల ఆరోగ్యాన్ని చెక్ చేయాలని భట్టి తెలిపారు. అలాగే ప్రభుత్వ హాస్టళ్లలోనే పారామెడికల్ స్టాఫ్ ఉండాలన్నారు. విద్యార్థులకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని తెలిపారు. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో తమ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు ఈ విధానం కొనసాగిందని తిరిగి గి అ విధానాన్ని మళ్ళీ తీసుకువస్తామన్నారు. గురుకులాలలో అత్యవసర ఔషధాలు పారామెడికల్ స్టాఫ్ కుక్కకాటు పాముకాటుకు మందులను అందుబాటులో ఉంచాలని సెక్రటరీని ఆదేశించారు. ప్రతి హాస్టల్లో నాణ్యత గలా ఆహారం అందించండి, శుచి శుభ్రత పాటించే విధంగా చర్యలు తీసుకోండన్నారు. హాస్టల్లో ఉన్న ప్రతి పిల్లాడికి కావలసిన మంచం బెడ్ బెడ్ షీట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపాలని గురుకులాల సెక్రటరీకి తెలిపారు. ప్రతి గురుకుల పాఠశాలలో టాయిలెట్స్, సమృద్ధిగా నీరు విద్యుత్తు, గురుకుల పాఠశాలకు కావలసిన భద్రతకు చర్యలు తీసుకోవాలన్నారు.
ఈజీఎస్ పనుల కింద గురుకుల పాఠశాలలో చెత్తా, చెదారం పిచ్చి మొక్కలు తీసివేయాలని, పండ్లు ఔషధ మొక్కలు నాటించాలని చెప్పారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్సు టీచర్స్ పారామెడికల్ సిబ్బంది స్థానికంగానే ఉండాలని ఆదేశించారు. ప్రతి నెల మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు హాస్టల్స్ సందర్శించాలి, ప్రతి నెలలో ఒక రోజున మంత్రులు శాసనసభ్యులు శాసనమండలి సభ్యులు గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని భట్టి తెలిపారు. ప్రభుత్వ ఆలోచనకు అనుగుణంగా జిల్లా కలెక్టర్లు, జిల్లా వైద్య అధికారులు కూడా ప్రతి నెల ఒక రోజున గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థులతో భోజనం చేసి వారి సమస్యలను తెలుసుకోవాలన్నారు.