విధాత : హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని, అందుకే న్యూయార్క్‌తో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు రూట్ విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందని రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డితో కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందంతో భేటీ అయ్యారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో పాటు ఇతర అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. హైదరాబాద్ గ్లోబల్ సిటీ వృద్ధి చెందుతున్న తీరు, వివిధ రంగాలు విస్తరిస్తున్నతీరుపై ఈ భేటీలో చర్చించారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుతోందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా తమ అధ్యయన వివరాలను పంచుకుంది. గడిచిన ఆరు నెలల్లో రియల్టీతో పాటు లీజింగ్, ఆఫీస్ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్ లోనూ హైదరాబాద్ సిటీ గణనీయమైన వృద్ధి నమోదు చేసిందని అభిప్రాయపడింది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోసారి వెల్లడించే తమ నివేదిక జులై నెలాఖరులో వెలువడుతుందని తెలిపింది.
ప్రపంచ నగరంగా హైదరాబాద్ అభివృద్ధి … విదేశీ కంపెనీ ప్రతినిధుల భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్ అభివృద్ధిలో దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచంలో పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలనేది తమ సంకల్పమని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ నుంచి అమెరికాలో ఉంటున్న వారి సంఖ్య, అక్కడి వెళ్లి వచ్చే వారి సంఖ్య పెరిగిపోయిందని, అందుకే న్యూయార్క్‌తో పోల్చుకునేలా హైదరాబాద్ ను తీర్చిదిద్దాల్సి ఉందని సీఎం అభిప్రాయపడ్డారు.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు