8, 9 తేదీల్లో చేప ప్రసాదం పంపిణీ.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు..
ఈ నెల 8, 9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏడాది మృగశిర కార్తె సందర్భంగా బత్తిని కుటుంబ సభ్యులు చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. చేప ప్రసాదం కోసం తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాలు ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి భారీగా జనాలు తరలివచ్చే అవకాశం ఉంది.

నేడు హైదరాబాద్‌లో చేప మందు పంపిణీ
ముందు రోజు నుంచే టోకెన్లకు క్యూలైన్లు
32కౌంటర్ల ద్వారా చేప మందు పంపిణీకి ఏర్పాట్లు
ఆరు లక్షల మందికి సరిపడా చేప మందు సిద్ధం
విధాత, హైదరాబాద్ : పత్రి ఏటా మృగశిర కార్తె సందర్భంగా అస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందించే చేప మందు(ప్రసాదం) పంపిణీకి ప్రభుత్వ యంత్రాంగం, బత్తిన కుటుంబం అన్ని ఏర్పాట్లతో సిద్ధమైంది. నేడు శనివారం మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీ చేసేందుకు ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేశారు. చేపమందు కోసం ఒకరోజు ముందుగా శుక్రవారం రోజుఉనే ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో టోకెన్ల కోసం జనం బారులు తీరారు. శనివారం ఉదయం 9 గంటలకు హైదరాబాద్ దూద్‌బౌలిలోని బత్తిని కుటుంబం ఇంట్లో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ప్రత్యేక వాహనంలో చేప మందును నాంపల్లిలోని ఎగ్జిబిషన్ మైదానానికి తీసుకొస్తారు. సుమారు ఆరు లక్షల మందికి సరిపడా చేప ప్రసాదం మందును సిద్ధం చేశామని బత్తిని అమర్‌నాథ్‌గౌడ్ పేర్కొన్నారు. శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు ఎగ్జిబిషన్ మైదానంలో, అనంతరం ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు కవాడీగూడ, దూద్‌బౌలిలో చేప ప్రసాదం పంపిణీ చేస్తామని చెప్పారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం ఏటా మృగశిర కార్తె రోజున చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడం విశేషం.ఎగ్జిబిషన్ గ్రౌండ్ అజంతా గేటు నుంచి లోపలికి ప్రజలను అనుమతిస్తారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బారికేడ్ల మధ్యలో నుంచి చేప ప్రసాదం కోసం వరుసలో వెళ్లాల్సి ఉంటుంది. ముందుగా టోకెన్లు తీసుకోవాలి. చేప ప్రసాదం పంపిణీకి మొత్తం 32 కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు ప్రత్యేక కౌంటరు ఏర్పాటు చేయనున్నారు.
తరలివస్తున్న అస్తమా బాధితులు
మరోవైపు చేప ప్రసాదాన్ని తీసుకునేందుకు తెలంగాణ, ఏపీ, రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చే వేలాది మంది ఉబ్బసం వ్యాధిగ్రస్తులు ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు చేరుకున్నారు. వారు అక్కడ ఏర్పాటు చేసిన షెడ్లలో ఉంటూ టోకెన్ల కోసం బారులు తీరారు. వారికి స్వచ్ఛంద సంస్థలు భోజనం, అల్పాహారం, తాగునీరు అందిస్తున్నారు. చేప మందును తీసుకుంటే శ్వాసకోశ ఇబ్బందులు ముఖ్యంగా ఆస్తమా వంటి సమస్యలు తగ్గిపోతాయని ప్రజలు విశ్వసిస్తుంటారు. అలాగే వివిధ శాఖల అధికారులు సమన్వయంతో మైదానంలో ఏర్పాట్లు చేస్తున్నారు.
చేప ప్రసాదం పంపిణీని పురస్కరించుకొని సుమారు 1200 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేపడుతున్నట్లు అబిడ్స్ ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ పేర్కొన్నారు. మైదానంలో పోలీసు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, సిటీ సెక్యూరిటీ వింగ్, డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో, తనిఖీలు నిర్వహించామని చెప్పారు. డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు, సీసీ టీవీలను ఏర్పాటు చేస్తామని ఏసీపీ ఆకుల చంద్రశేఖర్ వివరించారు. రెండు 108 అంబులెన్సులు, వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఆరు వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నారని చెప్పారు. రెండు అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచుతున్నట్లు వివరించారు.ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ వాహనాలను ఎంఎఎం గర్ల్స్ జూనియర్ కాలేజీలో పార్కింగ్ చేయాలి.
నాంపల్లితో పాటు పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జూన్ 8వ తేదీ తెల్లవారుజాము 12 గంటల నుంచి జూన్ 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.
ఆంక్షలు ఇలా..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ పరిసరాల్లో ఉన్న గృహకల్ప, గగన్ విహార్, చంద్ర విహార్ వద్ద తమ కార్లను పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. ఆ ప్రాంతాల్లో కార్లను పార్కింగ్ చేసి, గేట్ నంబర్ 2 నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లోకి వెళ్లాలని సూచించారు.
ఎంజే మార్కెట్ వైపు నుంచి వచ్చే బస్సులు, ఇతర వాహనాలను గాంధీ భవన్ లేదా గృహకల్ప వద్ద ఆపనున్నారు. అక్కడ్నుంచి గేట్ నంబర్ 2 ద్వారా జనాలను లోపలికి అనుమతిస్తారు.
ఎంజే మార్కెట్ నుంచి వచ్చే టూ వీలర్స్‌ను మనోరంజన్ కాంప్లెక్స్ ఏరియాలో పార్కింగ్‌కు అనుమతిస్తారు. నాంపల్లి నుంచి వచ్చే వారు గృహ కల్ప – బీజేపీ ఆఫీసు మధ్యలో టూ వీలర్స్‌ను పార్కింగ్ చేయాల్సి ఉంటుంది.
ఆర్టీసీ బస్సులు, ప్రభుత్వ వాహనాలను ఎంఎఎం గర్ల్స్ జూనియర్ కాలేజీలో పార్కింగ్ చేయాలి.
ట్రాఫిక్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే ట్రాఫిక్ హెల్ప్ లైన్ నంబర్ 9010203626 కు కాల్ చేయొచ్చు.