KTR | కేటీఆర్ బామ్మ‌ర్ది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ..! మ‌హిళ‌ల‌తో స‌హా 42 మంది అరెస్ట్..!!

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) బామ్మ‌ర్ది రాజ్ పాకాల( Raj Pakala ) ఫాంహౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ( Drugs Party ) నిర్వ‌హించిన‌ట్లు స్పెష‌ల్ పార్టీ, సైబ‌రాబాద్ ఎస్‌వోటీ పోలీసులు( SOT Police ) నిర్ధారించారు.

KTR | కేటీఆర్ బామ్మ‌ర్ది రాజ్ పాకాల ఫాం హౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ..! మ‌హిళ‌ల‌తో స‌హా 42 మంది అరెస్ట్..!!

KTR | హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్( KTR ) బామ్మ‌ర్ది రాజ్ పాకాల( Raj Pakala ) ఫాంహౌస్‌లో డ్ర‌గ్స్ పార్టీ( Drugs Party ) నిర్వ‌హించిన‌ట్లు స్పెష‌ల్ పార్టీ, సైబ‌రాబాద్ ఎస్‌వోటీ పోలీసులు( SOT Police ) నిర్ధారించారు. జ‌న్వాడ( Janwada ) రిజ‌ర్వ్ కాల‌నీలోని రాజ్ పాకాల ఫాంహౌస్‌( Raj Pakala Farm House )లో శ‌నివారం రాత్రి డ్ర‌గ్స్ పార్టీ నిర్వ‌హించిన‌ట్లు పోలీసులు తేల్చారు.

ఈ డ్ర‌గ్స్ పార్టీలో పాల్గొన్న 42 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని డ్ర‌గ్స్ టెస్టులు( Drugs Tests ) నిర్వ‌హించారు. విజయ్ మ‌ద్దూరు అనే వ్య‌క్తి కొకైన్ సేవించిన‌ట్లు పోలీసులు తెలిపారు. మిగ‌తా వారికి డ్ర‌గ్స్ టెస్టులు నిర్వ‌హిస్తున్నారు. పట్టుబ‌డిన వారిలో 14 మంది మ‌హిళ‌లు ఉన్న‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. వీరంద‌రిని మోకిల పోలీసు స్టేష‌న్‌( Mokila Police Station )కు త‌ర‌లించారు. భారీగా విదేశీ మ‌ద్యం( Foreign Liquor ) ప‌ట్టుబ‌డ‌డంతో దాన్ని ఎక్సైజ్ పోలీసుల‌కు( Excise Police ) అప్ప‌గించారు. రాజ్ పాకాల‌పై సెక్ష‌న్ 34, ఎక్సైజ్ యాక్ట్ కింద పోలీసులు కేసు న‌మోదు చేశారు. కొకైన్ తీసుకున్న విజ‌య్ మ‌ద్దూర్‌పై ఎన్డీపీఎస్ కింద కేసు న‌మోదు చేసిన‌ట్లు పేర్కొన్నారు.

ఇలా వెలుగులోకి..

అయితే డ్ర‌గ్స్ పార్టీ నిర్వ‌హిస్తున్న క్ర‌మంలోనే ఫామ్ హౌస్ నుంచి భారీ శ‌బ్దాలు వినిపించాయి. దీంతో అప్ర‌మత్త‌మైన స్థానికులు 100కు డ‌య‌ల్ చేసి పోలీసుల‌కు స‌మాచారం అందించారు. రాజ్ పాకాల ఫామ్ హౌస్ వ‌ద్ద‌కు చేరుకున్న పోలీసులు.. విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హించారు. భారీగా డ్ర‌గ్స్, విదేశీ మ‌ద్యం ప‌ట్టుబ‌డింది. 42 మందిని అరెస్టు చేశారు.