Indiramma Housing Scheme | ఇందిరమ్మ ఇండ్ల పథకం.. ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు శుభవార్త వినిపించిన భట్టి విక్రమార్క
రాష్ట్రంలోని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు
హైదరాబాద్ : రాష్ట్రంలోని నిరుపేదలకు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా పేదలు ఇండ్లు కట్టుకోవడానికి రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు.
ఎస్సీ, ఎస్టీ లబ్దిదారులకు రూ. 6 లక్షలు చెల్లిస్తామని ప్రకటించారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇండ్ల చొప్పున, మొత్తం 4,50,000 ఇండ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకం కింద నిర్మించే ఇండ్లు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో, ఆర్సీసీ కప్పుతో వంట గది, టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయని తెలిపారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం కింద పూర్తయిన ఇండ్లను త్వరలోనే అర్హులకు కేటాయిస్తామన్నారు. పూర్తికాని ఇండ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అందజేస్తామన్నారు. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద, బడుగు వర్గాల సొంతింటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాలను పెంపొందిస్తాయని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram