శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం

పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధిత కుటుంబానికి చెందిన బాలుడి అక్కకు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో, మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సహాయం

శ్రీతేజ్ కుటుంబానికి ఆర్థిక సాయం
  • వాత్సల్య పథకం ద్వారా నెలకు రూ.4 వేలు
  • ‘పుష్ప’ బెనిఫిట్ షోలో గాయపడ్డ బాలుడు

 

హైదరాబాద్, ఆగస్ట్ 25(విధాత): పుష్ప సినిమా బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో గాయపడిన బాధిత కుటుంబానికి చెందిన బాలుడి అక్కకు చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి ప్రత్యేక చొరవతో, మిషన్ వాత్సల్య పథకం కింద ఆర్థిక సహాయం అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈ పథకం కింద, బాలికకు ప్రతి నెల రూ.4,000 చొప్పున 18 సంవత్సరాలు వచ్చేంత వరకు ఆర్థిక సహాయం అందుతుందని చైల్డ్ రైట్స్ కమిషన్ చైర్‌పర్సన్ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటివరకు, గడిచిన మూడు నెలలకు రూ.4వేల చొప్పున మొత్తం రూ.12,000 బాలిక చదువు నిమిత్తం నేరుగా కుటుంబ ఖాతాలో జమ అయిందని తెలిపారు. చైల్డ్ రైట్స్ కమిషన్, మిషన్ వాత్సల్య పథకం ద్వారా మరెంతో మంది బాధిత బాలల కుటుంబాలకు అండగా నిలిచేలా చర్యలు కొనసాగించనుందని కమిషన్ సభ్యులు తెలియజేశారు.