Madhavi Latha | హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు
హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాధవీలతపై కేసు నమోదుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు.
హైదరాబాద్ : హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదైంది. మాధవీలతపై కేసు నమోదుకు జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ ఆదేశించారు. దీంతో ప్రజా ప్రాతినిధ్య చట్టం కింద మాధవీలతపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు.
మలక్‌పేట పీఎస్ పరిధిలోని అస్మాన్‌ఘడ్‌లోని హోలీ మదర్స్ స్కూల్‌లో ఓటేసేందుకు వచ్చిన ముస్లిం మహిళా ఓటర్ల గుర్తింపు కార్డులను మాధవీలత పరిశీలించిన సంగతి తెలిసిందే. వారి ఐడెంటిటీ కోసం ముస్లిం మహిళా నకాబ్ తొలగించి పరిశీలించారు మాధవీలత. దీంతో ఎన్నికల అధికారికి ముస్లిం నేతలు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదుకు ఎన్నికల అధికారి ఆదేశించారు. ఐపీసీ సెక్షన్లు 171సీ, 186, 505(10)(సీ), ప్రజాప్రాతినిధ్య చట్టం 132 సెక్షన్ కింద కేసు నమోదైంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram