విధాత : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే భారీ కార్నివాల్‌తో పాటు 5వేల మందితో ప్లాగ్‌మార్చ్ నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్.శాంతికుమారి తెలిపారు. శుక్రవారం కలెక్టర్ అనుదీప్, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి ఆమె సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో రాష్ట్ర అవిర్భావ వేడుకల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారని, ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారని వివరించారు. పరేడ్ గ్రౌండ్ మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేశారని వెల్లడించారు. జూన్2న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 5వేల మందితో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని సీఎస్ కోరారు. రేపు సాయంత్రం 5 గంటల నుంచి ప్రజలను ట్యాంక్ బండ్‌కు అనుమతిస్తారని తెలిపారు. వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫైర్‌వర్క్స్, కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వారితో ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు.
TG |5వేల మందితో ట్యాంక్‌బండ్‌పై ఫ్లాగ్ మార్చ్.. కొత్తగా నియామక పత్రాలు పొందిన వారికి ఆహ్వానం : సీఎస్ శాంతికుమారి
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 2న ట్యాంక్‌బండ్‌పై నిర్వహించే భారీ కార్నివాల్‌తో పాటు 5వేల మందితో ప్లాగ్‌మార్చ్ నిర్వహించనున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సీఎస్.శాంతికుమారి తెలిపారు

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు