Ramreddy Damodar Reddy | అధికార లాంఛనాలతో ముగిసిన రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు అధికార లాంఛనాలతో తుంగతుర్తి వేదికపై నిర్వహించబడ్డాయి. నెటిజన్లవైపు కన్నీటి వీడ్కోలు.
మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో శనివారం నాడు నిర్వహించారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తన వ్యవసాయక్షేత్రంలో దామోదర్ రెడ్డి అంత్యక్రియలను నిర్వహించారు. సూర్యాపేట నుంచి తుంగతుర్తికి దామోదర్ రెడ్డి పార్ధీవదేహన్ని శుక్రవారం నాడు రాత్రి తరలించారు. ప్రజల సందర్శనార్ధం శనివారం ఉదయం వరకు అక్కడే ఉంచారు.దామోదర్ రెడ్డి అంత్యక్రియల్లో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పాల్గొన్నారు. పీసీసీ చీఫ్ బి. మహేశ్ కుమార్ గౌడ్, మాజీ మంత్రి జి. జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్. పద్మావతి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బాలునాయక్,మాజీ ఎమ్మెల్యేలు బిక్షమయ్య గౌడ్, గాదరి కిశోర్ సహా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దామోదర్ రెడ్డిని కన్నీటి వీడ్కోలు పలికారు.
హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ దామోదర్ రెడ్డి మరణించారు. కొంతకాలంగా ఆయన మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నారు. దీంతో చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్ లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని తుంగతుర్తి, సూర్యాపేట అసెంబ్లీ స్థానాల నుంచి ఆయన పలు దఫాలు ఎమ్మెల్యేగా గెలిచారు. 1985, 1989లలో కాంగ్రెస్ అభ్యర్థిగా తుంగతుర్తి నుంచి ఆయన గెలిచారు. 1994లో ఇండిపెండెంట్ గా గెలిచారు.1999లో టీడీపీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు చేతిలో ఆయన ఓడిపోయారు. 2004లో మరోసారి ఆయన తుంగతుర్తి నుంచి గెలిచారు. నియోజకవర్గాల పునర్విభజనతో తుంగతుర్తి ఎస్ సీ లకు రిజర్వ్ అయింది. దీంతో ఆయన 2009లో సూర్యాపేట నుంచి పోటీ చేసి నెగ్గారు. 2014, 2018, 2023 లలో సూర్యాపేట నుంచి ఓడిపోయారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram