మాజీ ఎమ్మెల్యే కు.. జైలు శిక్ష

విధాత,భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలలు జైలు, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. విచారణలో అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. […]

  • Publish Date - August 12, 2021 / 02:55 PM IST

విధాత,భద్రాద్రి కొత్తగూడెం: పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు కోర్టు జైలు శిక్ష విధించింది. ఎన్నికల్లో డబ్బులు పంచారన్న అభియోగాలు రుజువుకావడంతో 6 నెలలు జైలు, రూ. 10వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. పాయం వెంకటేశ్వర్లు ఎన్నికల్లో డబ్బులు పంచారన్న ఆరోపణలతో 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్‌లో ఆయనపై కేసు నమోదైంది. విచారణలో అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది. కోర్టు ఆదేశాల మేరకు రూ. 10 వేలు జరిమాను వెంకటేశ్వర్లు చెల్లించారు. తీర్పుపై అప్పీలుకు వెళ్లేందుకు జైలు శిక్షను ప్రజా ప్రతినిధుల కోర్టు నిలిపివేసింది. అలానే ప్రభుత్వ చీఫ్‌ విప్ దాస్యం వినయ్ భాస్కర్‌పై ఉన్న కేసును కోర్టు కొట్టివేసింది.