విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రాంతం విషయమై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కూతురు వెన్నెల తీవ్రంగా ఖండించారు. తెలంగాణ గడ్డ నిన్న మా అయ్యల జాగీరే.. తెలంగాణ గడ్డ ఈరోజు మా జాగీరు. రేపు మా బిడ్డల జాగీరు అని వెన్నెల ఓ వీడియోలో స్పష్టం చేశారు. నటుడిగా, గద్దర్ అభిమానిగా పవన్ ను అభిమానిస్తారని, పైసలు పంచితేనో, లాబీలు చేస్తేనో తెలంగాణ రాలేదు.. తెలంగాణ ఉద్యమం ఆత్మ గౌరవ పోరాటం అని స్పష్టం చేశారు.
తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రాణాలు తీసుకున్నాం కానీ, ఎవర్ని ఒక్క మాట కూడా అనలేదు అని వెన్నెల గుర్తు చేశారు. త్యాగాలు చేసి తెలంగాణ తెచ్చుకున్నాం.. తెలంగాణ అన్నందుకు చాలా మందిని ఎన్ కౌంటర్ చేశారు. ఉద్యమంలో చాలా మంది తల్లులు తమ బిడ్డల్ని కోల్పోయారని వెన్నెల గుర్తు చేశారు.
