Hydra । హైడ్రాలోనే పనిచేస్తే జీహెచ్‌ఎంసీలో జీతం బంద్!
హైడ్రాలో పనిచేస్తున్న జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులు.. ప్రభుత్వం ఉత్తర్వులు వచ్చిన తర్వాత కూడా ఇంకా హైడ్రాలోనే పనిచేస్తుండటంపై జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి సీరియస్‌గా ఉన్నట్టు తెలుస్తున్నది.

- ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినా జీహెచ్‌ఎంసీకి రారా?
- విజిలెన్స్ అధికారులపై కమిషనర్ ఆమ్రపాలి సీరియస్?
Hydra । తెలంగాణలో, ప్రత్యేకించి రాజధాని హైదరాబాద్‌లో ఇప్పుడు ఏ నలుగురు ఒక దగ్గర చేరినా హైడ్రా మీదే చర్చ నడుస్తున్నది. చెరువుల కబ్జాలను తొలగిస్తున్న హైడ్రాను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. డిప్యూటేషన్‌పై కొందరు జీహెచ్‌ఎంసీ విజిలెన్స్ విభాగం అధికారులను పంపించారు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జీహెచ్‌ఎసీలో జీతం తీసుకుంటూ హైడ్రాలో పనిచేస్తున్న అధికారులపై కమిసనర్ ఆమ్రపాలి సీరియస్ అయినట్టు సమాచారం.
తిరిగి జీహెచ్‌ఎంసీకి వెళ్లిపోవాలని ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ వారు ఇంకా హైడ్రాలోనే పనిచేస్తుండటాన్ని ఆమె తీవ్రంగా పరిగణిస్తున్నారని తెలుస్తున్నది. జీహెచ్‌ఎంసీ అధికారులు హైడ్రా విధుల్లో ఉండటంతో ఇక్కడ విజిలెన్స్ విభాగం చేయాల్సిన పని కుంటుపడుతున్నదని స్థాయీ సంఘం ప్రతినిధులు గురువారం జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినప్పటికీ హైడ్రాలోనే పనిచేస్తున్నవారికి జీతాలు నిలిపేస్తామని ఆమె హెచ్చరించినట్టు తెలుస్తున్నది.
విజిలెన్స్ అధికారులు హైడ్రా కమిషనర్‌కు జవాబుదారీగా ఉంటూ జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవడం లేదని తెలుస్తున్నది. ఇది కూడా ఆమ్రపాలి ఆగ్రహానికి కారణంగా చెబుతున్నారు. కొందరు తాము హైడ్రాలోనే కొనసాగుతామని దాని కమిషనర్ రంగనాథన్‌కు లేఖలు పంపుతున్నారని సమాచారం. ఈ విషయంలో స్పష్టత పొందేందుకు హైడ్రా కమిషనర్ రంగనాథన్ కూడా ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
హైదరాబాద్ ఇక నివాస యోగ్యం కాదా? పట్టని పాలకులు.. అడ్డగోలుగా అనుమతులు
Money Plant | మనీ ప్లాంట్‌ను ఈ దిశలో ఉంచుతున్నారా..? అయితే వైవాహిక జీవితంలో విభేదాలు తప్పవు..!!