ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త.. రూ. 1900 బస్‌పాస్‌తో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణం..!
హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం ఆ బస్సుల నెల వారీ బస్ పాస్ ధరను ఆర్టీసీ యాజమాన్యం భారీగా తగ్గించింది.

హైదరాబాద్ : హైదరాబాద్‌లో నిత్యం ప్రయాణించే ప్రయాణికులకు టీజీఎస్ ఆర్టీసీ శుభవార్త వినిపించింది. పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సౌకర్యార్థం ఆ బస్సుల నెల వారీ బస్ పాస్ ధరను ఆర్టీసీ యాజమాన్యం భారీగా తగ్గించింది. ఇక నుంచి నెల వారీ పాస్‌ను కేవలం రూ. 1900కే అందిస్తోంది. ఈ అవకాశాన్ని ఆర్టీసీ ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్టీసీ యజమాన్యం విజ్ఞప్తి చేసింది.
గతంలో ఈ బస్ పాస్ ధర రూ.2530 ఉండగా.. ప్రయాణికుల కోసం రూ.630 తగ్గించింది. ఈ బస్సు పాస్‌తో సికింద్రాబాద్ – పటాన్ చెరువు (219 రూట్), బాచుపల్లి – వేవ్ రాక్(195 రూట్) మార్గాల్లో నడిచే గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. అంతేకాదు, ఈ బస్‌పాస్‌తో ఈ-మెట్రో ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ బస్సుల్లో కూడా ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. అలాగే, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సు పాస్ కలిగిన వారు రూ.20 కాంబినేషన్ టికెట్ తీసుకుని.. గ్రీన్ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ఒక ట్రిప్పులో ప్రయాణించవచ్చు. హైదరాబాద్‌లోని టీజీఎస్‌ఆర్టీసీ బస్సు పాస్ కేంద్రాలలో ఈ పాస్‌లను సంస్థ జారీ చేస్తోంది. అయితే ఎయిర్‌పోర్ట్ మార్గంలో నడిచే పుష్పక్ ఏసీ బస్సుల్లో ఈ పాస్ చెల్లుబాటు కాదు.