Ponnam Prabhakar | హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త … హర్షం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్
స్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త అందించింది. వై ఎస్ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ బీఆరెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది.

విధాత: హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ క్యాబినెట్ శుభవార్త అందించింది. వై ఎస్ హయాంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ బీఆరెస్ పాలనలో నిర్లక్ష్యానికి గురైంది. తిరిగి 10 ఏళ్ల తరువాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో పెండింగ్ ప్రాజెక్ట్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గురువారం జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదింది. గౌరవెల్లి ప్రాజెక్ట్ పెండింగ్ పనుల పూర్తి కోసం 437.0 కోట్లు విడుదలకి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రి మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాబినెట్ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహచర క్యాబినెట్ మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.