గ్రామ గ్రామాన ఘనంగా సంబరాలు చేయండి: మంత్రి పొన్నం

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలబోతుంది గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ను గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బధనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు

  • By: Subbu |    telangana |    Published on : Nov 14, 2025 1:08 PM IST
గ్రామ గ్రామాన ఘనంగా సంబరాలు చేయండి: మంత్రి పొన్నం

హైదరాబాద్, నవంబర్ 14(విధాత): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలబోతుంది గ్రామ గ్రామాన సంబరాలు చేయాలని కార్యకర్తలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ను గ్రామగ్రామాన సంబరాలు నిర్వహించాలన్నారు. ప్రజా పాలన ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.బీఆర్ఎస్, బీజేపీ కలిసి ప్రభుత్వాన్ని బధనాం చేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.

గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు అండగా, పేద ప్రజలకు ఉచిత విద్యుత్, సన్న బియ్యం, రేషన్ కార్డులు, సున్నా వడ్డీ రుణాలు, ఉద్యోగాలు, రుణమాఫీ, రైతు భరోసా ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నామన్నారు. జూబ్లీహిల్స్ గెలుపు ను ప్రతి కార్యకర్త తమ గెలుపు గా భావించి సంబరాలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.