Raja Singh | ఇదో బ్లాక్ డే: రాజాసింగ్ ట్వీట్ ఫైర్
హిందూత్వ వాదాన్ని గట్టిగా వినిపించే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బక్రీద్ పండుగపై తనదైన శైలీలో విమర్శనాత్మక ట్వీట్ చేశారు

విధాత, హైదరాబాద్ : హిందూత్వ వాదాన్ని గట్టిగా వినిపించే గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి బక్రీద్ పండుగపై తనదైన శైలీలో విమర్శనాత్మక ట్వీట్ చేశారు. ఆవుకు రొట్టెలు తినిపించే వారు.. రొట్టెతో ఆవును తినే వారు ఎప్పటికి సోదరులు కాలేరన్నారు. అవును తల్లిగా భావించే హిందూవులందరికీ ఈ రోజు ‘బ్లాక్ డే’ అని రాజాసింగ్ ట్వీట్ చేశారు.
బక్రీద్ సందర్భంగా రాజాసింగ్ చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. అంతకుముందు అసదుద్దీన్ ఓవైసీ ట్విట్టర్ వేదికగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీఫ్ వివాదంలో11 ఇళ్లను బుల్డోజ్ చేసిందని ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు తర్వాత అన్యాయమనే చక్రం ఆగడం లేదన్నారు. తమ విశ్వాసాలకు సంబంధించి రాజాసింగ్, ఒవైసీలు తరుచు ట్వీట్ల వార్ సాగిస్తునే ఉన్నారు.