విధాత : గవర్నర్లకు రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొల్పేందుకు సీఎంలు ముందుకురావాలని, వారు పంపించే ప్రతి ఫైల్‌పై సంతరం చేసే రబ్బర్ స్టాంపు ఆలోచన సరికాదని గవర్నర్ తమిళి సై అన్నారు. గురువారం ఆమె చెన్నైల ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్-2023సదస్సులో మాట్లాడారు.
గవర్నర్లు రాజ్యంగం మేరకు ఏది సరైనదో కాదో విచక్షణతో విశ్లేషించుకోవాలన్నారు. సీఎంలకు, గవర్నర్లకు మధ్య సంబంధాలు చాల రాష్ట్రాల్లో ఇటీవల దెబ్బతింటున్నాయన్నారు. ప్రత్యేకంగా తెలంగాణలో ఈ సమస్య అధికంగా ఉందన్నారు.
తెలంగాణలో ఎన్నికల సమయం కావడంతో తాను రాజ్యంగ పదవిలో ఉండి అన్ని విషయాలు ఇక్కడ బహిరంగంగా చెప్పలేనని, అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో మినహా గడిచిన మూడేళ్లుగా తెలంగాణ సీఎం తనను కలవలేదన్నారు. గవర్నర వ్యవస్థ కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిగానే కాకుండా ప్రభుత్వలకు, ప్రజలకు మధ్య వారధిగా చూడాలన్నారు.
దురదృష్టవశాత్తు గవర్నర్ ప్రజలను కలిస్తే కొందరు విమర్శలకు దిగుతున్నారన్నారు. చాల మంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నర్ వ్యవస్థ అవసరమని, అధికారంలోకి రాగానే అనవసరమంటూ విమర్శలు చేస్తుంటారన్నారు. గవర్నర్ల నిర్ణయాలపై రాజకీయ కోణంలో విమర్శలు చేస్తున్నారన్నారు. గవర్నర్ వ్యవస్థ రోడ్డుపై స్పీడ్ బ్రేకర్ లాంటిదని, అది ప్రమాదాలను నివారిస్తుందే తప్ప ప్రమాదాలకు కారణం కాదన్నారు.