కేసీఆర్‌ను కలిసిన గ్రేటర్ బీఆరెస్ ఎమ్మెల్యేలు
గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు

విధాత : గ్రేటర్ హైదరాబాద్‌కు చెందిన నలుగురు బీఆరెస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌ను కలిశారు. ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, ఎల్‌బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డిలు గురువారం ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంకు వెళ్లి కేసీఆర్‌ను కలిశారు.
పార్లమెంటు ఎన్నికల ఫలితాలు..తాజా రాజకీయ పరిణామాలపై వారు కేసీఆర్‌తో చర్చించినట్లుగా సమాచారం. గ్రేటర్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన బీఆరెస్ పార్లమెంటు ఎన్నికల్లో వెనుకబడి పోవడానికి కారణాలపై కేసీఆర్ వారితో సమీక్షించినట్లుగా తెలుస్తుంది.