ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సరళీకృతం చేయాలి: మండలి చైర్మన్ గుత్తా

ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. టూ వీలర్, ఫోర్ వీలర్ నిబంధనలను సడలించాలని ప్రభుత్వానికి సూచించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిబంధనలు సరళీకృతం చేయాలి: మండలి చైర్మన్ గుత్తా

ఇళ్ల పథకానికి ప్రజల్లో మంచి స్పందన ఉందని… ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తున్నారని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు . చిన్న ఆసౌకర్యాల కారణంగా లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్స్ ఇవ్వలేకపోతున్నారని… టూ వీలర్ , ఫోర్ వీలర్ వెహికిల్ ఉంటే ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయలేము అనే నిబంధనలు తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయంలో ఉమ్మడి నల్గొండ జిల్లా రెవెన్యూ& హౌసింగ్ శాఖల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి , ఉత్తమ్ కుమార్ రెడ్డి , కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి , అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు , ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి , అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సమావేశంలో గుత్తా మాట్లాడుతూ ఆర్ధిక భారం ఉన్నా సరే ఇందిరమ్మ ఇళ్ల పథకానికి నిధులు ఎక్కువగా కేటాయింపులు జరగాలని సూచించారు. డబుల్ బెడ్ రూమ్స్ ఇండ్లు కూడా త్వరగా పూర్తి చేసి లబ్దిదారులకు కేటాయించి వాటిని సద్వినియోగం జరిగేలా చూడాలన్నారు. భూ వివాదాలు లేకుండా చూడాలని , భూ భారతి ద్వారా భూ సమస్యలను పరిష్కరించాలని తెలిపారు.

ఇవి కూడా చదవండి :

విజయ్ కి గవర్నర్ మరోసారి షాక్… ప్రభుత్వ ఏర్పాటుకు నిరాకరణ.!
సాధారణ ట్రాఫిక్ లోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్