Nalgonda Heavy Rain : నల్లగొండలో దంచికొట్టిన వాన..హైవేపై ట్రాఫిక్ జామ్
నల్లగొండలో వరుసగా రెండో రోజు భారీ వర్షం. హైదరాబాద్-విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్. కోతకొచ్చిన వరి కళ్లాల్లోని ధాన్యం తడిసిపోవడంతో రైతులకు భారీ నష్టం.

విధాత : ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో వరుసగా రెండో రోజు భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం సాయంత్రం ఆకస్మాత్తుగా కుండపోతల కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ముందుకు కదలలేక కొద్ధిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది.
మరోవైపు భారీ వర్షంతో ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో కోతకొచ్చిన వరి పంటలు దెబ్బతినగా, కల్లాలలోని ధాన్యం, కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం రాసులు తడిసిపోయాయి. ప్రస్తుతం జిల్లా పరిధిలో వరి పంటల కోతల సీజన్ ప్రారంభమవ్వడం..అటు పత్తి పంటల దిగుబడులు వస్తుండటంతో భారీ వర్షాలు రైతాంగానికి నష్టదాయకంగా మారాయి.