Heavy Rains | ఆ రెండు జిల్లాల్లో అర్ధరాత్రి దంచికొట్టిన వాన.. అత్యధికంగా 149 మి.మీ. వర్షపాతం నమోదు
Heavy Rains | గురువారం అర్ధరాత్రి వేళ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.

Heavy Rains | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా గురువారం మధ్యాహ్నం నుంచి వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరంలోనూ నిన్న సాయంత్రం వాన దంచికొట్టింది. అయితే గురువారం అర్ధరాత్రి వేళ రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నల్లగొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షానికి స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు.
రంగారెడ్డి జిల్లాలోని తలకొండపల్లి మండల పరిధిలో అత్యధికంగా 149.3 మి.మీ. వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్ జిల్లాలోని బాలానగర్‌లో 123.0 మి.మీ. వర్షపాతం నమోదైంది. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లో 109.3, మంచాల, ఫరూఖ్‌నగర్ మండలాల పరిధిలో 108.3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
రాబోయే 2 – 3 గంటల్లో గద్వాల్, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ, నారాయణపేట, రంగారెడ్డి, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ క్రమంలో రైతులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
— Meteorological Centre, Hyderabad (@metcentrehyd) July 18, 2025