Rains | తెలంగాణ ప్రజలకు చల్లని కబురు.. ఐదు రోజుల పాటు వర్షాలు..!
Rains | రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

Rains | హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు రోజుల నుంచి భారీగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
ఈ క్రమంలో వాతావరణ శాఖ తెలంగాణ ప్రజలకు చల్లని కబురు అందించింది. ఆదివారం నుంచి రాగల 5 రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 30వ తేదీన నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయని, జూన్ 5, 6 తేదీల్లో రాష్ట్రంలోకి రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఇక శనివారం సాయంత్రం కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.