Heavy Rains | తెలంగాణలో నేడు, రేపు భారీ వర్షాలు..! జర జాగ్రత్త..!!
Heavy Rains | తెలంగాణ( Telangana )ను భారీ వర్షాలు( Heavy Rains ) ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇవాళ, రేపు కూడా పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్( Yellow Alert ) జారీ చేసింది.
Heavy Rains | హైదరాబాద్ : తెలంగాణ( Telangana ) వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఈ మోస్తరు నుంచి భారీ వర్షాలు( Heavy Rains ) కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ఇక మంగళవారం, బుధవారం రోజుల్లో కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా కొమోరిన్ ప్రాంతం వరకు సగటు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని పేర్కొంది.
దీంతో మంగళవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
బుధవారం నాడు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం ప్రకటించింది. పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది.
ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, మెదక్, వికారాబాద్‌తో పాటు పలుచోట్ల భారీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా మెదక్ జిల్లా రెగోడ్ గ్రామంలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని టీజీడీపీఎస్ వెల్లడించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram