Heavy Rains | నేడు ఈ ఐదు జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Heavy Rains | రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి.

Heavy Rains | నేడు ఈ ఐదు జిల్లాల్లో అతి భారీ వ‌ర్షాలు.. జ‌ర జాగ్ర‌త్త‌..!

Heavy Rains | హైద‌రాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ భారీ వ‌ర్షాల‌కు వాగులు, వంక‌లు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. న‌దులు ఉధృతంగా ప్ర‌వ‌హిస్తున్నాయి. అయితే ఆదివారం కూడా ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. రాజ‌న్న సిరిసిల్ల‌, క‌రీంన‌గ‌ర్, ములుగు, భ‌ద్రాద్రి కొత్త‌గూడెం, కామారెడ్డి జిల్లాల్లో భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ నేప‌థ్యంలో ఆయా జిల్లాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధికారులు హెచ్చరించారు. అవ‌స‌ర‌మైతేనే నివాసాల నుంచి బ‌య‌ట‌కు రావాల‌ని సూచించారు. ఇక శ‌నివారం నాడు రాష్ట్రంలోనే అత్య‌ధికంగా ములుగు జిల్లాలోని వెంక‌టాపురంలో 10.4 సెంటిమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది.

సోమ‌వారం ఈ జిల్లాల‌కు వ‌ర్ష‌సూచ‌న‌..

సోమవారం భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని చెప్పింది. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.

మంగ‌ళ‌వారం ఈ జిల్లాల్లో భారీ వ‌ర్షాలు..

మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌, ములుగు, కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, భువనగిరి, రంగారెడ్డి, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వెల్లడించింది. పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వానలే పడే అవకాశాలున్నాయని తెలిపింది.

బుధ‌వారం ఇలా..

బుధవారం భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మంలో భారీ వర్షాలు పడుతాయని.. మంచిర్యాల, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హన్మకొండ, జనగాం, రంగారెడ్డి, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే సూచనలున్నాయని వివరించింది.