Human Skeleton | నాంపల్లిలో మానవ అస్థిపంజరం.. ఉలిక్కిపడ్డ హైదరాబాదీలు..
Human Skeleton | భాగ్యనగరం( Hyderabad ) నడిబొడ్డున నాంపల్లి( Nampally )లో ఓ ఘటన కలకలం రేపింది. ఓ పాడుబడ్డ ఇంట్లో లభ్యమైన మానవ అస్థిపంజరం( Human Skeleton ) హైదరాబాదీలను ఉలిక్కిపడేలా చేసింది.

Human Skeleton | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలోని నాంపల్లి( Nampally )లో సోమవారం మధ్యాహ్నం ఓ భయానక దృశ్యం వెలుగు చూసింది. స్థానికంగా ఉన్న ఓ ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు అప్రమత్తమై పోలీసులకు సమాచారం అందించారు.
హుటాహుటిన ఆ ఇంటి వద్దకు పోలీసులు చేరుకున్నారు. ఇంటికి తాళం వేసి ఉండడంతో దాన్ని పగులగొట్టారు. ఇంట్లోకి అడుగుపెట్టగానే ఓ మానవ అస్థిపంజరం( Human Skeleton ) కనిపించింది. దీంతో స్థానికులు, పోలీసులు ఉలిక్కిపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసు ఉన్నతాధికారులు, ఫొరెన్సిక్ బృందాలు, క్లూస్ టీమ్స్ రంగంలోకి దిగాయి. మానవ అస్థిపంజరం లభ్యమైన ఆ ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. అయితే మానవ అస్థిపంజరం లభ్యమైన ఆ ఇల్లు గత ఐదేండ్లకు పైగా తాళం వేసి ఉందని స్థానికులు పోలీసులకు తెలిపారు. లభ్యమైన మానవ అస్థిపంజరం పురుషుడిదా..? మహిళదా..? అనే విషయం తేలాల్సి ఉంది. సౌత్ వెస్ట్ డీసీపీ చంద్ర మోహన్ ఆధ్వర్యంలో మానవ అస్థిపంజరాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ ఇంటి యజమాని వివరాలు కూడా తెలియాల్సి ఉంది.