Gandipet reservoir| జంటనగరాల తాగునీటి జలాశయాలలోకి మానవ వ్యర్థాలు!
జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులకు ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఆక్రమణలు, మురుగునీరు, వ్యర్థాల విలీనంతో డెంజర్ లో పడడంతో ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. తాజాగా గండిపేట (ఉస్మాన్ సాగర్) రిజర్వాయర్‌లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు పారబోస్తుండగా స్థానికులు, అధికారులు పట్టుకున్నారు.
విధాత, హైదరాబాద్ : జంట నగరాలు హైదరాబాద్, సికింద్రాబాద్ నగర వాసులకు ప్రధాన తాగునీటి వనరులుగా ఉన్న ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు ఆక్రమణలు, మురుగునీరు, వ్యర్థాల విలీనంతో డెంజర్ లో పడడంతో ప్రజల ఆరోగ్యానికి సవాల్ విసురుతున్నాయి. తాజాగా గండిపేట (ఉస్మాన్ సాగర్) రిజర్వాయర్‌లో సెప్టిక్ ట్యాంకు వ్యర్థాలు పారబోస్తుండగా స్థానికులు, అధికారులు పట్టుకున్నారు. మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధిలో ఉస్మాన్ సాగర్ సమీపంలో ఎఫ్టీఎల్ పాయింట్ నంబర్ 428 వద్ద సెప్టిక్ ట్యాంకులోని మల, మూత్ర విసర్జన వ్యర్థాల(septic tank waste dumping)ను తీసుకొచ్చి జలాశయం(Gandipet reservoir)లో వదిలిన ట్యాంకర్ ను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.
వెంటనే పోలీసులు అక్కడికి చేరుకొని ట్యాంకర్ ను పట్టుకున్నారు. డ్రైవర్‌ను విచారించగా హైదరాబాద్ సైదాబాద్ ఏరియాలోని సింగరేణి కాలనీకి చెందిన రామావత్ శివ నాయక్ గా గుర్తించారు. అనంతరం వాటర్ బోర్డు ఎస్బీ ఉస్మాన్ నగర్ సెక్షన్ డీజీఎం(ఈ) నరహరి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఇన్‌స్పెక్టర్ పవన్ కుమార్ రెడ్డి తెలిపారు. సెప్టిక్ ట్యాంకర్ కి అక్రమంగా వాటర్ బోర్డు, GHMC లోగో పెట్టుకుని మరి ట్యాంకర్ ను వినియోగిస్తున్నారని వెల్లడించారు.
తాగునీటి జలాశయంలో మనుషుల వ్యర్థాలు అన్‌లోడ్ వ్యవహారంపై హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీని స్థానికులు తిట్టిపోస్తున్నారు. ఉస్మాన్‌సాగర్‌లో అధికారులే దగ్గరుండి పారబోయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు అధికారి నరహరిపైనా స్థానికులు ఫిర్యాదు చేశారు. కళ్లముందే తాగునీటి వనరుగా ఉన్న గండిపేట(ఉస్మాన్ సాగర్) జలాశయం కలుషితం కావడానికి అధికారులే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గండిపేట (ఉస్మాన్ సాగర్) పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 3.9 టీఎంసీలు. అయితే జలమండలి ఏడాదికి 1.45 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగిస్తోంది. రోజుకు 25 ఎంజీడీల నీటిని వినియోగించుకునే అవకాశం ఉన్నాప్పటికి.. 19 ఎంజీడీల నీరు మాత్రమే సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి గరిష్ఠంగా నీటిని వినియోగించుకునేందుకు ప్రస్తుతం ఉన్న కాండ్యూట్‌కు సమాంతరంగా 14.5 కి.మీ. పైపులైన్ వేసేందుకు రూ.600 కోట్లతో అంచనాలు రూపొందించారు. నిధులు లేక 8 నెలలుగా పనులు సాగడం లేదని స్థానికులు వెల్లడించారు.
గండిపేట తాగు నీటి చెరువులో సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలు..
హైదరాబాద్ వాసుల తాగునీటి ప్రధాన వనరైన గండిపేట చెరువు
ఇప్పుడు మాఫియాల చేతుల్లో విషపు గుంటగా మారుతోందా..?
రాత్రి వేళల్లో అక్రమంగా సెప్టిక్ ట్యాంక్ వ్యర్థాలను చెరువులోకి వదులుతున్న ముఠా.ఎవరి అనుమతితో..? ఎవరి రక్షణలో..?… pic.twitter.com/uB6NfrQ5Qb
— Telugu Reporter (@TeluguReporter_) December 18, 2025
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram