Hyderabad : హైదరాబాద్‌లో భారీ వర్షం..
హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసి రహదారులు జలమయం. ఎల్బీనగర్, అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు, ట్రాఫిక్ అంతరాయం.
                                    
            హైదరాబాద్, సెప్టెంబర్ 11 (విధాత): హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. క్షణాల వ్యవధిలోనే ఆకాశానికి చిల్లుపడినట్లు కుండపోత వర్షం కురిసింది. దీంతో రహదారులన్నీ జలమయం అయ్యాయి. మోకాలిలోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. ముఖ్యంగా ఎల్బీనగర్, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో హైదరాబాద్-విజయవాడ రహదారి జలమయం అయింది. ఈ నేపథ్యంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోవడంతో పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.
                    
                                    X
                                
                        Google News
                    
                        Facebook
                    
                        Instagram
                    
                        Youtube
                    
                        Telegram