Hidden Camera Detection in Malls | షాపింగ్ మాల్స్‌లో రహస్య కెమెరాలపై హైదరాబాద్ పోలీసుల నజర్
హైదరాబాద్ పోలీసులు ఒక వినూత్న అన్వేషణ మొదలుపెట్టారు. నగరంలోని షాపింగ్ మాల్స్‌లో ఎక్కడైనా రహస్య కెమెరాలున్నాయేమోనని వెతుకులాట ప్రారంభించారు. రాష్ట్ర విద్యాశాఖ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులతో కలిసి పోలీసులు ఈ తనిఖీలు నిర్వహిస్తారు.

హైదరాబాద్ మహిళలు, పిల్లల రక్షణకై, పబ్లిక్ ప్లేసుల్లో వారి భద్రత కోసం(safer Hyderabad for women and children), 78వ స్వాతంత్ర్యదినం సందర్భంగా హైదరాబాద్ పోలీస్(Hyderabad Police) ఒక ప్రత్యేక చొరవ తీసుకుంది. విద్యాశాఖ(Dept. of Education), ఎన్ఎస్ఎస్(NSS) విద్యార్థుల భాగస్వామ్యంతో నగరంలోని అన్ని షాపింగ్ కాంప్లెక్స్(Shopping Complexes)లు, మాల్స్(Malls)లో రహస్య లేదా నిఘా కెమెరా(Hidden or Spy Cameras)ల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. నగర కమిషనర్ కే.శ్రీనివాస రెడ్డి(CP K. Srinivasa Reddy), విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బి.వేంకటేశం(B Venkateshsham, Principal Secretary, Education Department) గురువారం నాడు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.
ఇందులో పాల్గొనేందుకు సుశిక్షితులైన మహిళా సిబ్బంది(Women Professional Experts)ని కూడా వినియోగిస్తారు. వారు షాపింగ్ మాళ్లలోని డ్రెస్ చేంజింగ్ రూమ్‌లు, వాష్‌రూమ్‌లు, టాయిలెట్స్ లాంటి ప్రదేశాలలో రహస్య కెమెరాలకై తనిఖీలు నిర్వహిస్తారు. దీనికోసం మామూలుగా క్షుణ్ణంగా వెతకడంతో పాటు, అత్యాధునిక సాంకేతిక పరికరాల(Latest Technolgy)ను కూడా వాడనున్నారు. ఏ కెమెరా లేకుండా అంతా బాగుంది అనుకుంటే, ఆ ప్రాంతాన్ని వ్యక్తిగత సురక్షిత ప్రాంతం(Declared Camera Free)గా ప్రకటించి, ఆ మేరకు ఒక స్టిక్కర్ (No Hidden Cameras Inside) అంటిస్తారు.
మహిళల, పిల్లల భద్రత కోసం అంతటా ఒక వ్యక్తిగత సురక్షిత వాతావరణాన్ని సృష్టించడానికి ఈ కార్యక్రమం పనికొస్తుంది. ఇందులో పాల్గొనే బృందాలు, నగరమంతటా తరచూ తనిఖీలు నిర్వహిస్తూనేఉంటాయి. ఈ ప్రోగ్రాంలో పాల్గొనే ఎన్ఎస్ఎస్ విద్యార్థుల(NSS Students)కు అ మేరకు హవర్బ్యాంక్ అకౌంట్ క్రెడిట్లు(Hour bank Account credits) కూడా ఇస్తారు. మొత్తం అన్ని కాంప్లెక్సులు, మాళ్లు అయిపోయేదాకా ఈ కార్యక్రమం కొనసాగుతూనేఉంటుందని కమిషనర్ తెలియజేసారు.