HYDRAA | కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువులో హైడ్రా కూల్చివేత‌లు

HYDRAA | కూక‌ట్‌ప‌ల్లి( Kukatpally ) న‌ల్ల చెరువు( Nalla Cheruvu )లో అక్ర‌మంగా నిర్మించిన భ‌వ‌నాల‌ను హైడ్రా( HYDRAA ) కూల్చివేస్తోంది. నివాస భ‌వ‌నాల‌ను మిన‌హాయించి 16 షెడ్ల‌ను హైడ్రా నేల‌మ‌ట్ట చేస్తోంది. అక్క‌డ పోలీసులు( Police ) ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

  • By: raj |    telangana |    Published on : Sep 22, 2024 9:01 AM IST
HYDRAA | కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువులో హైడ్రా కూల్చివేత‌లు

HYDRAA | హైద‌రాబాద్ : హైద‌రాబాద్( Hyderabad ) న‌గ‌ర ప‌రిధిలో ఉన్న చెరువులు( Ponds ), జలాశయాల( Lakes )ను కబ్జాల నుంచి కాపాడేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం( Congress govt ) హైడ్రా(హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ)( HYDRAA )ను ఏర్పాటు చేసిన సంగ‌తి తెలిసిందే. ఓ వారం ప‌ది రోజుల పాటు విరామం తీసుకున్న హైడ్రా( HYDRAA ) మ‌ళ్లీ కూల్చివేత‌ల‌ను ప్రారంభించింది.

నిన్న కోకాపేట్‌లో కూల్చివేత‌లు చేప‌ట్ట‌గా, తాజాగా కూక‌ట్‌ప‌ల్లి( Kukatpally ) న‌ల్ల చెరువు( Nalla Cheruvu )లోని ఆక్ర‌మ‌ణ‌ల‌ను హైడ్రా( HYDRAA ) సిబ్బంది కూల్చేస్తున్నారు. ఈ చెరువు విస్తీర్ణం మొత్తం 27 ఎక‌రాలు కాగా, దీంట్లో ఎఫ్‌టీఎల్‌( FTL ), బ‌ఫ‌ర్ జోన్‌( Buffer Zone )లో 7 ఎక‌రాలు ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్లు అధికారులు తేల్చారు. బ‌ఫ‌ర్ జోన్‌లోని నాలుగు ఎక‌రాల్లో 50కి పైగా ప‌క్కా భ‌వ‌నాలు, అపార్ట్‌మెంట్లు నిర్మించారు. ఎఫ్‌టీఎల్‌లోని మూడు ఎక‌రాల్లో 25 భ‌వ‌నాలు, 16 షెడ్లు నిర్మించారు. నివాసం ఉన్న భ‌న‌వాల‌ను మిన‌హాయించి 16 షెడ్ల‌ను హైడ్రా కూల్చివేస్తోంది. ఈ నేప‌థ్యంలో న‌ల్ల చెరువు వ‌ద్ద పోలీసులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

కోకాపేట గ్రామ సర్వే నంబర్‌ 147లో దాదాపు 800 గజాల ప్ర‌భుత్వ‌ స్థలాన్ని కొందరు ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను హైడ్రా అధికారులు శనివారం కూల్చేశారు. దశాబ్దకాలం తాము ఇక్కడ నిర్మాణాలను చేపట్టి.. నివాసముంటున్నామని, ఇప్పుడు హైడ్రా అధికారులు తమ ఇండ్లపై బుల్డోజర్లు పెట్టి కూల్చివేశారంటూ.. స్థానికులు బోరుమ‌న్నారు. కనీసం సమాచారం ఇవ్వకుండా పేదల నివాసాలను హైడ్రా, రెవెన్యూ అధికారులు కూల్చివేయడం సరికాద‌న్నారు. కోకాపేట గ్రామ సర్వే నంబర్‌ 147లో దాదాపు 800 గజాల స్థలాల్లో వేర్వేరుగా కొందరు వ్యక్తులు రాత్రికి రాత్రి నిర్మాణాలను చేపట్టి.. నివాసాలను ఏర్పర్చుకున్నారని వీటిపై స్థానికుల ఫిర్యాదుల మేరకు స్పందించి కూల్చివేసినట్లు తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.