Telangana | తెలంగాణాలో అరుదైన మూలకాల నిల్వలు గుర్తింపు
తెలంగాణాలో అరుదైన మూలకాల నిల్వలు వెలుగుచూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది

విధాత, హైదరాబాద్ : తెలంగాణాలో అరుదైన మూలకాల నిల్వలు వెలుగుచూశాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఫోన్స్, కంప్యూటర్ హార్డ్‌డ్రైవ్ వంటి పరికరాల్లో ఉపయోగించే అరుదైన మూలకాల నిల్వలు ఉన్నట్లు బయటపడింది. మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా చేపట్టిన మట్టి నమూనాల పరీక్షల్లో ఈ విషయం వెల్లడైంది. 15 రకాల లాంథనైడ్స్‌తో పాటు స్కాండియం, వైట్రియం ఖనిజాలు ఉన్నట్లుగా గుర్తించినట్లు జీఎస్‌ఐ నివేదిక ఇచ్చింది.
దీంతో రాష్ట్ర గనులశాఖ ఖనిజాల అన్వేషణకు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. వైట్రియం ఖనిజం కిలో రూ.32వేలు విలువచేస్తుండటం విశేషం. రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాల్లో ఈ అరుదైన ఖనిజ సంపద ఉన్నట్లుగా కేంద్రానికి నివేదిక పంపించారు. జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే కొనసాగి త్రవ్వకాల దిశగా ముందడుగు పడితే మరింత విలువైన ఖనిజ సంపద ఈ జిల్లాల్లో లభించవచ్చని భావిస్తున్నారు.