TG Weather Update | బంగాళాఖాతంలో అల్పపీడనం.. నాలుగు రోజులు తెలంగాణలో వానలు..!
TG Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోనాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది.

TG Weather Update | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో హైదరాబాద్‌తో సహా పలు జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో రాష్ట్రంలో మరోనాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఆయా జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంగళవారం నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
బుధవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, వనపర్తి, నారాయణపేట, నాగర్ కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వివరించింది. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలోని సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, మహూబాబాద్, ములుగు, నల్గొండ జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిశాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కాస్త బలహీనపడింది. అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. రెండురోజుల్లో పశ్చిమ, వాయువ్య దిశగా వాయుగుండం కదిలే అవకాశం ఉందని చెప్పింది. ఉత్తర తమిళనాడు, దక్షిణకోస్తా తీరాలకు వైపుగా కదిలే అవకాశం ఉందని చెప్పింది. ఈ క్రమంలో ఏపీలోని, తమిళనాడులో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఇప్పటికే దక్షిణ కోస్తా, రాయలసీమతో పాటు చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వాతావరణశాఖ ఆయా జిల్లాలకు రెడ్ అలెర్ట్‌ను జారీ చేసింది.