Suicide | ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం

హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకుంది

Suicide | ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య యత్నం

విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ చైతన్య కళశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య యత్నం చేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం చేదురుబావి తండాకు చెందిన వేణుశ్రీ శ్రీచైతన్య కాలేజీలో సెకండియర్ చదువుతోంది.

తన హాస్టల్ గదిలో సూసైడ్ నోట్ రాసి మరి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకుంది. స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. కళాశాల యాజమాన్యం వేధింపులతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు యత్నించిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మార్కులు..ఫీజుల ఒత్తిడికి తాళలేక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుందంటున్నారు