Mallu Bhatti Vikramarka | మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ .. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి

రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి సమాలోచనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తరువాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.

Mallu Bhatti Vikramarka | మండలానికో ఇంటర్నేషనల్ స్కూల్ .. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి

విధాత: రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ఏర్పాటు చేయడానికి సమాలోచనలు చేస్తున్నామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. మంగళవారం అసెంబ్లీ సమావేశం వాయిదా పడిన తరువాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రతి మండలానికి మూడు సెమి రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. సెమీరెసిడెన్షియల్ స్కూల్స్ లో 4 నుంచి 12 వ తరగతి వరకు బోధిస్తారన్నారు. విద్యార్థులందరికీ ఉచిత ప్రయాణం కల్పిస్తామన్నారు. అలాగే విద్యార్థులను ఇంటి నుంచి స్కూల్స్ కు తీసుకు వెళ్లడానికి, ఇంటి నుంచి స్కూల్స్ కు తీసుకు వెళ్లడానికి నిరుద్యోగులు కానీ, నిరుద్యోగులైన విద్యార్థుల తల్లిదండ్రులు కానీ ముందుకు వస్తే, వారికి వాహనాలు ఇప్పిస్తామన్నారు. తల్లిదండ్రులే వారి పిల్లలను భద్రంగా ఇంటి నుంచి స్కూల్ కు , స్కూల్ నుంచి ఇంటికి తీసుకు వెళ్లల వచ్చునని తెలిపారు. ఈ మేరకు నిరుద్యోగులకు ట్రాన్స్ పోర్ట్ వాహనాలు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు.
నర్సరీ నుంచి 3వ తరగతి విద్యార్థుల వరకు అంగన్ వాడీలలో విద్యా భోదన జరుగుతుందని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. అంగన్ వాడీలలో ఉండే ఉద్యోగులు సపరేటు అని నర్సరీ నుంచి 3వ తరగతి వరకు విద్యాభోదన చేసే టీచర్లు సపరేటని చెప్పారు. ఐఐఐటీ బాసరలో మత్తు మందు దిరకడం దురదృష్టకరమన్నారు. విద్యార్థులు మత్తుకు బానిసలు కాకుండా చదువుపై కేంద్రీకరించాలన్నారు. మత్తుకు బానిసలై జీవితాన్ని దుర్భరం చేసుకోవద్దని హితవు పలికారు. అలాగే మత్తు పదార్థాల సరఫరా దారులు, విక్రయదారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ కు ప్రాధాన్యత ఇవ్వాలని మేమూ అడిగామన్నారు.