ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ చూస్తూ డ్రైవింగ్‌.. బావిలోకి దూసుకెళ్లిన కారు

థార్‌ వాహనంలో ప్రయాణిస్తూ... మొబైల్‌లో ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌ చూస్తున్న క్రమంలో కారు బావిలోకి దూసుకెళ్లిన ప్రమాదంలో ఒకరు చనిపోయారు.

క్రికెట్ మోజులో పడి ఓ వ్యక్తి తన ప్రాణాన్ని కోల్పోయాడు. తెలంగాణలోని జగిత్యాల రూరల్ మండలం మోరపెల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మరణించాడు. నివేష్, అశ్విన్, అరుణ్ అనే ముగ్గురు యువకులు థార్‌ వాహనంలో ప్రయాణిస్తూ… మొబైల్‌లో ఐపీఎల్‌ ఫైనల్ మ్యాచ్‌ చూస్తూ ప్రయాణించారు.

ఈ క్రమంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న బావిలోకి దూసుకెళ్లింది. డ్రైవింగ్‌ చేస్తున్న జగిత్యాలకు చెందిన అరుణ్ బావిలో మునిగి మృతి చెందగా.. నివేష్, అశ్విన్ సురక్షితంగా బయటపడ్డారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది రెండు గంటలు శ్రమించి అరుణ్ మృతదేహాన్ని, కారును బయటకు తీశారు.

Latest News