Malla Reddy | సొంత గూటికి మల్లారెడ్డి…టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు…పార్టీ మారుతారా?

రేవంత్‌ ప్రభుత్వం తనను రాజకీయంగా దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటే మళ్లీ టీడీపీలోకి మారితే తప్ప సాధ్యం కాదని సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం.

Malla Reddy | సొంత గూటికి మల్లారెడ్డి…టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు…పార్టీ మారుతారా?

మేడ్చల్‌ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి (Malla Reddy)  పార్టీ మారుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ కూల్చివేతలు జరిగాయి. కబ్జాటకు పాల్పడ్డారని ఆరోపణలు వస్తున్నాయి. మల్కాజ్‌గిరి ఎంపీ స్థానానికి తన కొడుకు బరిలోకి దింపాలని భావించినా రేవంత్‌ ప్రభుత్వ తనపై, తన విద్యా సంస్థలపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని అందుకే ఆయన వెనక్కి తగ్గారనే వాదనలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అల్లుడు రాజశేఖర్‌రెడ్డితో కలిసి సీఎం సన్నిహితుడైన ప్రభుత్వ సలహాదారు వేం నరేంద్రర్‌ రెడ్డితో భేటీ అయ్యారు. అప్పుడే ఆయన కూడా పార్టీ మారుతారని అనుకున్నారు. కానీ అది మర్యాదపూర్వక భేటీ అని ఆ వాదననలు కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచార సమయంలోనూ ఒక ఫంక్షన్‌హాల్‌లో ఈటల కలిసి హత్తుకుని మల్కాజ్‌గిరిలో నువ్వే గెలుస్తున్నావని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపైవ తర్వాత వివరణ ఇచ్చారు. పార్టీ మారాలంటు బీఆర్‌ఎస్‌ ( BRS) కార్పొరేటర్లపై ఒత్తిడి తెస్తున్నారని విమర్శించారు.ఇలా రకరకాల రాజకీయ దని భావిస్తున్నట్టు ఉన్నారు.

2014లో మల్కాజిగిరిలో టీడీపీ అభ్యర్థిగా నిలబడి విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లోకి మారి 2018లో మేడ్చల్‌ ఎమ్మెఒత్తిడిలను ఎదుర్కొంటూ ఆయన ప్రస్తుతం బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నాఎక్కువ కాలం ఇందులోనే ఉంటే ఇబ్బంది తప్పల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ( KCR ) కేసీఆర్‌, కేటీఆర్‌లను (KTR) ఆకాశానికి ఎత్తేవిధంగా ప్రశంసలు కురిపించారు. రేవంత్‌రెడ్డి తనపై చేసిన విమర్శలకు ధీటుగా స్పందిస్తూ ఛాలెంజ్‌ చేశారు. కానీ బీఆర్‌ఎస్‌ ఓటమి తర్వాత మల్లారెడ్డి టార్గెట్‌ అయ్యారు. రేవంత్‌ ప్రభుత్వం తనను రాజకీయంగా దెబ్బతీయడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలంటే మళ్లీ టీడీపీలోకి మారితే తప్ప సాధ్యం కాదని సన్నిహితుల వద్ద చెప్పినట్టు సమాచారం. టీడీపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తామని పార్టీలోకి రావాలని అక్కడి నుంచి పిలుపు వచ్చిందని వారితో చెప్పినట్టు తెలుస్తోంది. చంద్రబాబు చెబితే రేవంత్‌ రెడ్డి వింటారనని, అప్పుడు మనం రాజకీయ ఒత్తిళ్ల నుంచి దూరం కావొచ్చు చెప్పారట. అలాగే జనసేనకు కూడా తెలంగాణలో బలం ఉందని, రానున్న రోజుల్లో ఆపార్టీతో కలిసి టీడీపీని బలోపేతం చేయవచ్చని మల్లారెడ్డి అన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. వీటిపై స్పందించిన మల్లారెడ్డి అలాంటిదేమీలేదని తాను పార్టీ మారే ప్రసక్తే లేదని అంటున్నారు.

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ (TDP) పోటీ చేయాలని యోచిస్తున్నది. అలాగే ఖమ్మం, గ్రేటర్‌ పరిధిలోనూ పార్టీని బలోపేతం చేయాలని తద్వారా రాష్ట్ర రాజకీయాల్లోనూ మరోసారి టీడీపీ క్రియాశీలంగా వ్యవహరించాలనుకుంటున్నది. ఈ నేపథ్యంలోనే మల్లారెడ్డి పార్టీ మార్పు అంశం మరోసారి తెరమీదికి రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మల్లారెడ్డి పార్టీ మారుతారా? అనే వాదనలు వినిపిస్తున్నాయి.