" /> " /> " />
మున్సిపల్ కౌన్సిలర్ గా గెలవడానికి 3 కోట్లు ఖర్చు అవుతుందా? విధాత:"కౌన్సిలర్ గా గెలవడానికి మూడు కోట్లు ఖర్చు పెట్టా.పార్టీ కోసం అహర్నిశలు కష్టాపడ్డా.అయినా సొంత పార్టీ నేతల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి"అని నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్,కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా పంపిన లేఖ ఇది.ఇప్పుడీ లేఖ వివాదాస్పదంగా కూడా మారింది.నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్ కోడి వెంకన్న తన ఆవేదనను కేటీఆర్ ద్వారా పంచుకోవాలని తన […]
మున్సిపల్ కౌన్సిలర్ గా గెలవడానికి 3 కోట్లు ఖర్చు అవుతుందా?
విధాత:”కౌన్సిలర్ గా గెలవడానికి మూడు కోట్లు ఖర్చు పెట్టా.పార్టీ కోసం అహర్నిశలు కష్టాపడ్డా.అయినా సొంత పార్టీ నేతల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి”అని నల్గొండ జిల్లాకు చెందిన అధికార పార్టీ కౌన్సిలర్,కేటీఆర్ కు ట్విట్టర్ ద్వారా పంపిన లేఖ ఇది.ఇప్పుడీ లేఖ వివాదాస్పదంగా కూడా మారింది.నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీకి చెందిన ఒకటో వార్డు కౌన్సిలర్ కోడి వెంకన్న తన ఆవేదనను కేటీఆర్ ద్వారా పంచుకోవాలని తన వేదనను ట్విట్టర్ ద్వారా తెలియ జేశాడు.
ఇందులో అసలు ట్విస్ట్ ఏంటంటే తాను ఎన్నికలకు కేవలం 39 వేలు మాత్రమే ఖర్చు పెట్టినట్టు ఎలక్షన్ అధికారులకు లెక్కలు చెప్పాడు.కానీ ట్విట్టర్ లేఖ లో మాత్రం తాను అక్షరాల 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు,అవసరమైతే విచారణ కూడా చేసుకోవాలంటూ కేటీఆర్ ను కోరడం వివాదానికి దారి తీసింది. మారింది. పార్టీ అధిష్టానం కోడి వెంకన్న సమస్యను ఏ మేరకు పరిష్కరిస్తుందనేది పక్కన పెడితే ఎన్నికల నిబంధనకు విరుద్ధంగా అధిక మొత్తంలో ఖర్చు చేసినందుకు గాను,కోడి వెంకన్నపై IT దర్యాప్తు తప్పదని అంటున్నారు.