UTTAM | బాధ్యతలు స్వీకరించిన తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్ అలేఖ్య పుంజల … అభినందించిన మంత్రి ఉత్తమ్ దంపతులు
: తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా నియామితులైన అలేఖ్య పుంజల శుక్రవారం తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు హాజరై అభినందించారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్మన్‌గా నియామితులైన అలేఖ్య పుంజల శుక్రవారం తన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇరిగేషన్, పౌరసరఫరాల శాఖ మంత్రి ఎన్ .ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆయన సతీమణి కోదాడ ఎమ్మెల్యే పద్మావతిలు హాజరై అభినందించారు. అలేఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ సంగీత నాటక అకాడమీ తెలంగాణ సంస్కృతి, కళారూపాలను నిలబెట్టేందుకు, ప్రోత్సహించేందుకు అనేక కొత్త కార్యక్రమాలు చేపడుతుందని మంత్రి ఉత్తమ్ విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణను భారతదేశ సాంస్కృతిక పటంలో ఉంచుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram