తెలంగాణలో మే 11 నుండి 17 వరకు విద్యా వారోత్సవాలు
తెలంగాణలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మే 11 సోమవారం నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలను విద్యాశాఖ నిర్వహించనుంది. విద్యా వారోత్సవాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు.
విధాత, హైదరాబాద్ : తెలంగాణలో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక”లో భాగంగా మే 11 సోమవారం నుంచి 17 వరకు విద్యా వారోత్సవాలను విద్యాశాఖ నిర్వహించనుంది. సర్కారు స్కూళ్ల బలోపేతానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా విద్యా వారోత్సవాలను నిర్వహిస్తున్నారు.
విద్యా వారోత్సవాలను సోమవారం సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. ఈ సందర్బంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన/ప్రారంభోత్సవం నిర్వహించనున్నారు. సీఎంరేవంత్ రెడ్డి రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి, విద్యా సంస్కరణలు, మౌలిక వసతుల బలోపేతంపై ప్రభుత్వ దిశానిర్దేశాన్ని వెల్లడించనున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వివిధ ప్రదర్శన స్టాళ్లను ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు సందర్శించనున్నారు. ప్రభుత్వ విద్యా రంగంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, నూతన ఆవిష్కరణలు, విద్యార్థుల ప్రతిభను ఈ స్టాళ్ల ద్వారా ప్రదర్శించనున్నారు.
తెలంగాణ రాష్ట్ర గీతంతో వారోత్సవాల కార్యక్రమం ప్రారంభమవుతుంది. అనంతరం పాఠశాల బ్యాండ్లు, ఎన్‌సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ బృందాల మార్చ్‌పాస్ట్ నిర్వహిస్తారు. విద్యాశాఖ కార్యదర్శి ప్రభుత్వ విద్యాభివృద్ధికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, విద్యా వారోత్సవాల లక్ష్యాలపై సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఉప ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు కూడా సభలో ప్రసంగిస్తారు. కార్యక్రమంలో ప్రతిభా అవార్డులు ప్రదానం చేయనున్నారు. అలాగే ఐఐటీ అడ్వాన్స్ పరీక్షకు అర్హత సాధించిన కేజీబీవీ యంగ్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎక్సలెన్స్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను పంపిణీ చేయనున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram