Jagadish Reddy : కేసీఆర్ ను దెబ్బతీసే కుట్రలో ఆ ముగ్గురు
కేసీఆర్‌ను రాజకీయంగా దెబ్బతీసేందుకు రేవంత్ రెడ్డి, చంద్రబాబు, మోదీ కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పేరు తలుచుకుంటేనే రేవంత్ రెడ్డికి నిద్ర పడుతుందన్నారు.

విధాత, హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS) అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) ను రాజకీయంగా, మానసికంగా దెబ్బతీసే కుట్రలో సీఎం రేవంత్ రెడ్డితో(Revanth Reddy) పాటు ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu), ప్రధాని మోదీలు ఉన్నారని మాజీ మంత్రి జి.జగదీష్ రెడ్డి(Jagadish Reddy) ఆరోపించారు. సిద్దిపేటలో(Siddipet) ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతాడనే ఆ ముగ్గురు కేసీఆర్ ను అణిచివేసే కుట్ర చేస్తున్నారన్నారు.
మనదరికంటే ఎక్కువగా కేసీఆర్(KCR) ని నిత్యం సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటున్నారని, కేసీఆర్, కేటీఆర్(KTR) పేరు తలచుకుంటేనే ఆయనకి నిద్ర పడుతుందని జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు. కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదని కాంగ్రెస్(Congress) నేతలు ఓ వైపు చెబుతునే..ఇంకోవైపు కేసులు..కరెంట్, కాళేశ్వరం, ఈ ఫార్ములాపై కమీషన్లు అంటున్నారని విమర్శించారు.