Jangaon | నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్

రఘునాథపల్లి మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ (లొకల్ బాడీస్) పింకేష్ కుమార్ గురువారం పరిశీలించారు.

Reported by: chinna | తెలంగాణ‌ | Nov 27, 2025, 6:50 pm IST
Read Time: 2 mins
Jangaon | నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్

విధాత, జనగామ :

రఘునాథపల్లి మండలంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లు, నామినేషన్ ప్రక్రియను అదనపు కలెక్టర్ (లొకల్ బాడీస్) పింకేష్ కుమార్ గురువారం పరిశీలించారు. మొదటగా MPDO కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లు, పోలింగ్ స్టేషన్ల సిద్ధత, సిబ్బంది కేటాయింపు, ఎన్నికల సామగ్రి అందుబాటు, భద్రతా చర్యలు వంటి అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఎన్నికల ప్రక్రియపారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎలాంటి అంతరాయం లేకుండా సాగేందుకు అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.

అనంతరం ఖిలాషాపూర్ క్లస్టర్‌లో జరుగుతున్న నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అదనపు కలెక్టర్ , అభ్యర్థుల నామినేషన్ దరఖాస్తుల స్వీకరణ, రికార్డుల నిర్వహణ, వీడియో రికార్డింగ్, పోలీస్ బందోబస్తు, ఎన్నికల నిబంధనల అమలు వంటి అంశాలను తనిఖీ చేశారు. నామినేషన్ ప్రక్రియను సక్రమంగా, చట్టబద్ధంగా, పూర్తిస్థాయి పారదర్శకతతో నిర్వహించాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో MPDO రఘునాథపల్లి, MPO, ఎన్నికల విభాగ సిబ్బంది, లైన్ డిపార్ట్‌మెంట్ అధికారులు పాల్గొన్నారు.