Jeevan Reddy| జీవన్ రెడ్డికి మంత్రులు శ్రీధర్ బాబు, లక్ష్మణ్ ల బుజ్జగింపులు!

కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డితో శనివారం మంత్రులు డి.శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన మంత్రులు ఆయనతో మంతనాలు సాగించారు. జీవన్ రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రులు ఆయనను బుజ్జగించి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

Jeevan reddy

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి టి.జీవన్ రెడ్డితో శనివారం మంత్రులు డి.శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ లు భేటీ అయ్యారు. ఆయన ఇంటికి వెళ్లిన మంత్రులు ఆయనతో మంతనాలు సాగించారు. జీవన్ రెడ్డి పార్టీ వీడుతారన్న ప్రచారం నేపథ్యంలో మంత్రులు ఆయనను బుజ్జగించి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ మారవద్దని జీవన్ రెడ్డికి మంత్రుల సూచించారు. ఏదేని సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. అటు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ చార్జ్ మీనాక్షి నటరాజన్ సైతం జీవన్ రెడ్డితో చర్చించేందుకు ఆయనను హైదరాబాద్ రావాలని కోరారు. అయితే ఆమెనే తన వద్దకు రావాలని జీవన్ రెడ్డి సూచించినట్లుగా సమాచారం.

బీఆర్ఎస్ నేతలతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో జీవన్ రెడ్డి

కాంగ్రెస్ లో తనను కాదని ఫిరాయింపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు పెద్దపీట వేయడాన్ని జీర్ణించుకోలేక పార్టీ మార్పు ఆలోచన చేస్తున్న జీవన్ రెడ్డి శనివారం రంజాన్ సందర్భంగా మరో ట్వీస్టు ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన రంజాన్ ప్రార్థనల్లో పాల్గొనడం ఆసక్తి రేపింది. మంత్రులు బుజ్జగింపుల రోజునే జీవన్ రెడ్డి బీఆర్ఎస్ మాజీ జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతతో కలిసి రంజాన్ ప్రార్థనల్లో సందడి చేయడం చర్చనీయాంశమైంది. దీంతో జీవన్ రెడ్డి ఇప్పటికే పార్టీ మార్పుపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకున్నారన్న విషయం స్పష్టమైపోయిందని అనుచరవర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి :

Jagtial SI suicide| జగిత్యాల టూ టౌన్ ఎస్సై ఆత్మహత్య
gold, silver prices| స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Latest News