JOB CALANDER | అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి.. నోటిఫికేషన్లు, పరీక్షల వివరాలివే..

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది.

JOB CALANDER | అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి.. నోటిఫికేషన్లు, పరీక్షల వివరాలివే..

ఎన్నికల హామీ మేరకు అసెంబ్లీలో ప్రకటన

విధాత, హైదరాబాద్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీ మేరకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. జాబ్ క్యాలెండర్ ప్రకారం టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో గ్రూప్-1 పరీక్షలు అక్టోబరులో, గ్రూప్-2ను డిసెంబరులో, గ్రూప్-3 నవంబరులో నిర్వహించనున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. వైద్యఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ నియామకాల కోసం సెప్టెంబర్లో నోటిఫికేషన్ విడుదల… నవంబర్లో పరీక్షలు నిర్వహిస్తామని పేర్కోన్నారు. ట్రాన్స్‌కోలో వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాల కోసం అక్టోబర్‌లో నోటిఫికేషన్.. వచ్చే ఏడాది జనవరిలో నియామక పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. నవంబర్లో టెట్ నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చే ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని, వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్లో పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల.. ఏప్రిల్లో పరీక్షలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాలకు వచ్చే ఏడాది పిభ్రవరిలో నోటిఫికేషన్ మేలో పరీక్షలు, గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష వచ్చే ఏడాది జూలైలో నిర్వహించనున్నారు. ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్‌లో నోటిఫికేషన్ విడుదల చేసి ఆగస్టులో పరీక్షలు నిర్వహిస్తారు. డిగ్రీ కళాశాలల్లో అధ్యాపకులు, ఫిజికల్ డైరెక్టర్లు, లైబ్రేరియన్ పోస్టులకు వచ్చే ఏడాది జూన్లో నోటిపికేషన్.. సెప్టెంబర్లో పరీక్షలు నిర్వహించనున్నారు. వచ్చే ఏడాది మేలో మరోసారి గ్రూపు 2 నోటిఫికేషన్.. అక్టోబర్‌లో పరీక్షల నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జులైలో గ్రూప్-3 నోటిపికేషన్ నవంబర్ నెలలో పరీక్షలు, సింగరేణిలో పలు ఉద్యోగాల కోసం వచ్చే ఏడాది జులైలో నోటిఫికేషన్, నవంబర్‌లో పరీక్షలు నిర్వహించనున్నారు.