EC Meeting With Political Parties | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…రాజకీయ పక్షాలతో ఈసీ భేటీ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. కొత్త ఎన్నికల సంస్కరణలతో ఉప ఎన్నికలు జరుగుతాయని ఆయన వెల్లడించారు.

EC Meeting With Political Parties | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక…రాజకీయ పక్షాలతో ఈసీ భేటీ

విధాత: జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక షెడ్యూల్‌ ప్రకటించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో ముఖ్య ఎన్నికల అధికారి సి.సుదర్శన్‌రెడ్డి మంగళవారం సమావేశమయ్యారు. ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఆమ్‌ ఆద్మీ, మజ్లిస్‌(ఎంఐఎం) తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.

ఈ సందర్బంగా ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు సీఈసీ జ్ఞానేశ్ కుమార్ ప్రవేశపెట్టిన కొత్త ఎన్నికల సంస్కరణలతో నిర్వహించబడనున్నట్లు వెల్లడించారు. ఈ సంస్కరణలు మొదట బీహార్‌.. ఆపై దేశవ్యాప్తంగా జరగనున్న 8 అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల్లో అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగా రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలు చేసుకోవాలని సూచించారు.