Jubilee Hills By-poll Analysis | జూబ్లీ ఓటమితో బీజేపీ అధికార ఆశలు గల్లంతు?
రాష్ట్రంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం తమదేనని చెబుతూ వస్తున్న బీజేపీకి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితం పూర్తి నిరాశను కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
విధాత, ప్రత్యేక ప్రతినిధి:
Jubilee Hills By-poll Analysis | జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో విజయంపై ధీమా వ్యక్తం చేసిన బీజేపీకి డిపాజిట్ గల్లంతైంది. నిజానికి రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా చెబుతున్న బీజేపీకి.. ఆ ఆశలు ఎంత ఫలిస్తాయనేందుకు దీనిని ఒక ఉదాహరణగా చూపుతున్నారు. కేంద్రంలో మోదీ అధికారం కోసం బీజేపీ తనకు తాను రాష్ట్రంలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ లోక్‌సభ ఎన్నికల్లో అవయవదానం చేసి బీజేపిని అధికారంలో నిలిపిందని ఇప్పటికే కాంగ్రెస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. తాజాగా జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో ఆ పార్టీ అనుసరించిన అభ్యర్ధి ఎంపిక ‘జాప్యం’ ప్రచార ప్రారంభం ఆ పార్టీకి శాపంగా మారాయంటున్నారు.
Jubilee Hills By-poll Analysis | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమితో బీఆర్ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితి!
తాము గెలవడం కంటే కాంగ్రెస్‌ను ఎలా ఓడించాలనే దానికే బీజేపీ నేతలు ప్రాధాన్యమిచ్చారనే వాదనలు వినిపిస్తున్నాయి. పార్టీలో రెండు వర్గాలున్నాయనే ప్రచారం బహిరంగంగానే సాగుతోంది. పార్లమెంటు ఎన్నికల్లో నెలకొన్న సానుకూలతను ఆ పార్టీ నాయకులు ఇప్పుడు తగ్గించుకున్నారంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజా ఫలితాల్లో బీజేపీ అభ్యర్ధికి డిపాజిట్ దక్కలేదంటున్నారు. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, బలమైన నాయకత్వం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అర్బన్ లో కొంత కేడర్ బేస్ ఉన్నందున రాబోయే రోజుల్లో పట్టణ ప్రాంతాల్లో సానుకూల ఫలితం వచ్చే అవకాశం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం ఇంకా ఆ పార్టీ పట్టును పెంచుకునేందుకు ప్రణాళికలు అమలు చేయాల్సిందేనంటున్నారు.
Jubilee Hills By-poll Analysis | ‘జూబ్లీ’ ఫలితం ప్రభావమెంత? లాభనష్టాల లెక్కల్లో పార్టీలు!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో లభించిన విజయంతో ఉత్సాహం నెలకొనగా, తాజా ఎన్నికల్లో డిపాజిట్లు దక్కకపోవడం ఇప్పుడు ఆ పార్టీ తీవ్ర చర్చకు దారితీస్తోంది. పార్టీలో బహిరంగ గ్రూపులు ఆ పార్టీని ఇబ్బందులపాలు చేస్తోందంటున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా రాష్ట్రాభివృద్ధికి ఆ పార్టీ ఏం చేస్తుందనే ప్రశ్నలకు ధీటైన సమాధానం లభించడంలేదంటున్నారు. రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు, నిధులు తేకుండా కేంద్ర మంత్రులు, ఎంపీలు మాటలకే పరిమితమైతే విమర్శలపాలవడం తప్ప విజయాలు దక్కవంటున్నారు. ప్రజా విశ్వాసాన్ని పొందలేరంటున్నారు.
Read Also |
క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డిదే..
CM Revanth:ఈ విజయం భూకంపం వచ్చే ముందు ఇచ్చే అలర్ట్ లాంటిది
Kishan Reddy : బీహార్, జూబ్లీహిల్స్ ఎన్నికలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందన
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram