జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నవీన్ యాదవ్

జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఎన్నికలు అయ్యిపోయాయి, రాజకీయ వైషమ్యాలను పక్కకు పెట్టి మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడదామని వెల్లడించారు

  • By: Subbu |    telangana |    Published on : Nov 14, 2025 3:14 PM IST
జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: నవీన్ యాదవ్

హైదరాబాద్, నవంబర్ 14(విధాత): జూబ్లీహిల్స్ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ అన్నారు. ఎన్నికలు అయ్యిపోయాయి, రాజకీయ వైషమ్యాలను పక్కకు పెట్టి మన ప్రాంత అభివృద్ధి కోసం కష్టపడదామని వెల్లడించారు. బీఆర్ఎస్ పార్టీ చేసిన దుష్ప్రచారానికి ప్రజలు సరైన తీర్పు ఇచ్చారన్నారు. జాబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ నా తరుఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పేర్కొ్న్నారు. జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నవీన్ యాదవ్ తెలిపారు.

కాగా జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థిపై 24,729 వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ ఉదయం ఓట్ల లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచి నవీన్‌ యాదవ్‌ పత్రి రౌండ్ లోనూ ఆధిక్యం కనబరిచారు. ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్ ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. మొత్తం 10రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు 24,729 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. పోలింగ్ ముగిశాక కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేసుకున్న అంచనా మేరకు మెజార్టీ సాధించడం గమనార్హం.