అవినీతికి కేరఫ్ అడ్రస్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ అంటూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ఘాటుగా స్పందించారు
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య
విధాత, వరంగల్ ప్రతినిధులు: అవినీతికి కేరఫ్ అడ్రస్ బీజేపీ అభ్యర్థి అరూరి రమేష్ అంటూ వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ఘాటుగా స్పందించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాసన్ పర్తిలో తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు నిర్వహించిన కృతజ్ఞత సభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కావ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అరూరి రమేష్ కి ఓటు వేస్తే మన భూములు రాసిఇచ్చినట్లేనని హెచ్చరించారు.
మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. రెడ్డి సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని చెప్పారు. అగ్రవర్ణాలలో ఉన్న పేదలకు కూడ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో ఎంపీగా గెలిపిస్తే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.