కవిత: కాళేశ్వరం పై ఆరోపణలన్నీ అబద్దాలే
విధాత: కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆరోపణలన్ని అబద్దాలే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ కవిత(BRS MLC Kalvakuntla Kavitha) ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. మేడిగడ్డ కూలిపోయింది..కొట్టుకుపోయింది అన్నది నూటికి నూరుపాళ్లు అవాస్తవమేనని..మేడిగడ్డ బ్యారేజీ ఏడో బ్లాక్ లో కుంగింది రెండు పిల్లర్లు మాత్రమేనన్నారు. ఆ రెండు పిల్లర్లు కుంగిన నాటి నుంచి మేడిగడ్డ మీదుగా 5,657 టీఎంసీల నీళ్లు కిందికి ప్రవహించాయని..అందులో సగానికిపైగా కుంగిందని చెప్తోన్న ఏడో బ్లాక్ నుంచే వెళ్లాయని..అయినా బ్యారేజీ చెక్కు చెదరలేదని తెలిపారు. మరమ్మతులు చేస్తే మేడిగడ్డనే తెలంగాణ జీవగడ్డగా నిలుస్తుందని… కాళేశ్వరమే తెలంగాణ జీవధార అవుతుంది అన్న వాస్తవాన్ని ఇకనైనా పాలకులు గుర్తించాలని కవిత సూచించారు. ఎన్డీఎస్ఏ(NDSA) పేరు చెప్పి రైతుల పొలాలు ఎండబెట్టే ప్రయత్నాలకు ఫుల్ స్టాప్ పెట్టాలన్నారు. మేడిగడ్డకు రిపేర్లు చేసి.. కాళేశ్వరం మోటార్లు ఆన్ చేసి పంట పొలాలకు నీళ్లివ్వాలని కవిత డిమాండ్ చేశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram