విధాత : తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కాక రేపుతుంది. అగ్రెసివ్ గా పనిచేసే లీడర్ ను నూతన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి. ఆయన వ్యాఖ్యలకు మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ స్ట్రాంగ్ రీప్లే ఇచ్చారు. స్ట్రీట్ ఫైటర్ కావాలా రియల్ ఫైటర్ కావాలా అని.. ఐదుగురు ముఖ్యమంత్రులతో కొట్లాడినవాడినని సందర్భం వస్తే ఏనుగు కుంభ స్థలాన్నైనా కొట్టగలిగే వాడినని ఘాటుగా ప్రతిస్పందించారు. పార్టీ నూతన అధ్యక్షుడు ఎంపికపై రాజాసింగ్.. ఈటల మధ్య మాటల యుద్ధం ఇలా ఉండగానే అటు మెదక్ ఎంపీ రఘునందన్ రావు తాను సైతం పార్టీ అధ్యక్షుడు రేసులో ఉన్నానంటూ చెప్పేశారు. కొత్తగా బీజేఎల్పి నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతం పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఆయన అకస్మాత్తుగా ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ పెద్దలను కలవడం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి రేసులో ఈటల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. అయితే బీజేపీ హై కమాండ్ అంతిమంగా ఎవరికి రాష్ట్ర కమలదళం సారధ్యం అప్పగిస్తారన్నది వేచి చూడాల్సి ఉంది.
బీజేపీ రాష్ట్ర పగ్గాల కోసం కమలనాధుల పోటీ … ఢిల్లీలో ఏలేటి
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కాక రేపుతుంది. అగ్రెసివ్ గా పనిచేసే లీడర్ ను నూతన రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపాయి.

Latest News
12 ఏళ్ల బీజేపీ ఏలుబడిలో 152 పేపర్ లీకేజీలు
‘పాండోరా బాక్స్’ అసలు రహస్యం ఇదేనా? ట్విస్టులతో కూడిన ఆసక్తికర కథ
శాన్ఫ్రాన్సిస్కోలో ఘనంగా M4M మూవీ 60 రోజుల విజయోత్సవం! ‘M4M-2’ సీక్వెల్
‘మిస్టర్ మిడిల్ క్లాస్’ అందరికీ కనెక్ట్ అవుతున్న పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్!
గోదావరి పుష్కరాలలోపే భద్రాద్రికి నూతన వైభవం: మంత్రి పొంగులేటి
వచ్చే మూడు నెలలకు ఒకేసారి రేషన్ : కేంద్రం కీలక నిర్ణయం
హాస్టల్ మెస్‌లోకి మొసలి.. అంతా పరుగో పరుగు!
సర్ పూర్తయ్యే వరకు గాంధీభవన్ రావద్దు : సీఎం రేవంత్ రెడ్డి
మా భూములకు కాదు… మా బతుకులకే కంచె వేస్తున్నారు !
జపాన్ ఓపెన్ టైటిల్ విజేత పీ.వీ.సింధు